News February 3, 2025
సోన్: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందిన ఘటన సోన్ మండలంలో జరిగింది. స్థానిక ఎస్ఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. పాక్‌పట్ల గ్రామానికి చెందిన నరసయ్య (48) తన పంట చేనుకు నీరు పెట్టడానికి సోమవారం ఉదయం వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News February 3, 2025
సిద్దిపేట: ప్రోమో ఆవిష్కరించిన DMHO
ప్రాచీన ఆరోగ్య విధానాలు, యోగాను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించవచ్చని సిద్దిపేట జిల్లా వైద్య& ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వాన్ కుమార్ అన్నారు. సోమవారం శత సహస్ర సూర్య నమస్కార ప్రదర్శన, రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించి ప్రోమో ఆవిష్కరించారు భారతీయ ఆరోగ్య విధానాలు ప్రపంచానికి మార్గదర్శకమన్నారు.
News February 3, 2025
HYD: అనుమతి నిరాకరించడంపై మందకృష్ణ ఫైర్
లక్ష డప్పులు.. వేయి గొంతులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడలో ఆయన మాట్లాడుతూ.. సీఎం, డీజీపీ HYD సిటీ సీపీ పునరాలోచించాలని, పునఃసమీక్ష చేసి అనుమతిని మంజూరు చేయాలన్నారు. MRPS ఏ రోజూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పని చేయలేదని, మాదిగ పల్లెలో కనుమరుగవుతున్న డప్పులు మళ్లీ పునరుజ్జీవం పోసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
News February 3, 2025
నెల్లూరు పోలీస్ గ్రీవెన్స్‌కు 95 ఫిర్యాదులు
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 95 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.