News April 1, 2025
సోమందేపల్లిలో ఘర్షణ.. ఒకరి మృతి

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం సాయినగర్‌లో మంగళవారం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అప్పు వ్యవహారంలో బావ మారి, బావమరిది నారాయణ ఘర్షణకు దిగారు. మారీ కర్రతో దాడి చేయడంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘర్షణలో మృతుడు నారాయణ అన్న అంజికి గాయాలలైనట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Similar News
News April 3, 2025
BREAKING: వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 226 ఓట్లు, వ్యతిరేకంగా 163 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ బిల్లుకు సునాయాసంగా ఆమోదం లభించింది. ఓటింగ్‌లో మొత్తం 390 మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిలో ఒక సభ్యుడు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 12 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
News April 3, 2025
NGKL: అమ్మాయిలు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారా.. జాగ్రత్త..!

మహిళలకు రక్షణ, భద్రత కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో షీ టీం పనిచేస్తోందని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళలు సామాజిక మధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగంలో పలు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
News April 3, 2025
జనగామ: కలెక్టర్‌ను కలిసిన జిల్లా ఆర్టీఏ నెంబర్

జనగామకి చెందిన చిలువేరి అభి గౌడ్ జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్‌గా నియమితులైన సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, డీసీపీ మహేంద్ర నాయక్, సీఐ దామోదర్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం తరఫున, రవాణా శాఖకు సంబంధించి అన్ని రకాలుగా అవగాహన కల్పించడంతో పాటు అందరూ బాధ్యతాయుతంగా ఉండేలా చేసుకోవాలని అధికారులు వారికి సూచించారు.