News March 29, 2025
సోమవారం పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈనెల 31న రంజాన్ పండుగ సందర్భంగా పీజీఆర్ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు శనివారం కలెక్టర్ షాన్‌మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలు, అధికారులందరూ గమనించాలని ఆయన కోరారు.
Similar News
News April 1, 2025
నేడు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలంలోని కొత్తగొల్లపాలెంలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం దివ్యాంగులకు స్కూటీలు అందజేస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. బాపట్లలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
News April 1, 2025
అలంపూర్: ‘నిర్లక్ష్యానికి నిదర్శనం ప్రభుత్వ వైద్యశాల’

అలంపూర్ పట్టణ పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలలో కనీస రోగులకు అందించే మందులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. అలంపూర్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీకి చెందిన పలువురు కుక్క కాటుకు గురయ్యారు. ఈ క్రమంలో వైద్యశాలకు వెళితే కుక్కకాటుకు మందు వైద్యశాలలో లేదని పక్క రాష్ట్రమైన కర్నూల్‌కి వెళ్లాలని వైద్యులు సూచించారని రోగులు ఆరోపిస్తున్నారు. కనీసం మందులు లేకుంటే ఎట్లా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు?
News April 1, 2025
నారాయణపేట: సెంట్రల్ GOVT జాబ్ కొట్టాడు..!

నారాయణపేట మండల పరిధిలోని కందేన్‌పల్లి గ్రామానికి చెందిన యువకుడు బోయిని రఘువర్ధన్ ఇండియన్ నేవీ ఆర్మీ జాబ్ సాధించాడు. పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆ యువకుడి తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎంతో కష్టపడి చదివి జాబ్ సాధించాడు. నేవి జాబ్ సాధించిన రఘువర్ధన్‌కు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.