News May 7, 2025

సోమవారం GVMCలో PGRS రద్దు: కలెక్టర్

image

GVMCలో ఈనెల 28న జరగనున్న PGRS కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శనివారం తెలిపారు. మేయర్ ఎన్నిక సోమవారం కానున్నందున GVMC ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం రద్దు చేసినట్లు పేర్కొన్నారు. GVMC జోనల్ కార్యాలయాల్లో యథావిధిగా PGRS ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై జోనల్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయాలన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

Similar News

News September 11, 2025

తెలుగు వారికి అండగా ఉంటాం: పల్లా శ్రీనివాస్

image

టీడీపీ ఎల్లప్పుడూ తెలుగు వారి యోగా క్షేమాలు చూస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం నారా లోకేశ్ అన్ని ఏర్పాట్లు చేశాలని తెలిపారు. వారిని వైజాగ్ తీసుకొచ్చి వారి ప్రాంతాలకు పంపే ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రుషికేశ్‌లో వరదల సమయం, ఉక్రెయిన్ వార్ సమయంలో ఇలాంటి విపత్కర పరిస్థితి‌లో తెలుగు వారికి టీడీపీ అండగా ఉందని గుర్తు చేశారు.

News September 11, 2025

విశాఖ: కాల్పుల కేసులో లొంగిపోయిన నిందితుడు

image

విశాఖలో సంచలనం సృష్టించిన చిలకపేట కాల్పుల కేసులో కానిస్టేబుల్ నాయుడు కోర్టులో లొంగిపొగా14 వరకు రిమాండ్ విధించారు. పలు ఆరోపణలతో ఆయన ఇది వరకే సస్పెండ్ అయ్యాడు. చేపల రాజేశ్‌పై కాల్పులు జరిపిన కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా A-3గా నాయుడు ఉన్నాడు. కోర్టులో లొగిపోవడానికి ముందు విశాఖ సీపీకి ‘తాను ఏ తప్పూ చేయలేదని’ వాట్సప్‌లో మెసేజ్ పెట్టినట్లు సమాచారం. సీఐ జీడీ బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News September 11, 2025

బ్లూమ్‌బర్గ్ ఛాలెంజింగ్ పోటీలకు విశాఖ ఎంపిక

image

బ్లూమ్‌బర్గ్ మేయర్స్ ఛాలెంజ్‌లో విశాఖ ఎంపికైందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. 99 దేశాల్లో 600 నగరాలు పోటీ పడగా 50 నగరాలను ఫైనల్‌కు చేశారని, ఇందులో విశాఖ నిలిచిందని చెప్పారు. ప్రతి పౌరుడు జీవీఎంసీ అధికారిక వెబ్‌సైట్‌లో క్యూఆర్ కోడ్‌తో తమ ఆలోచనలు, అభిప్రాయాలు, సూచనలు పంచుకోవాలన్నారు. ఈనెలలో 19వ వార్డులో వర్క్ షాప్ నిర్వహించనున్నామన్నారు.