News January 2, 2026

సోమశిల కృష్ణానదిలో యువకుడి గల్లంతు

image

కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణానదిలో ఓ యువకుడు గల్లంతైన ఘటన వెలుగు చూసింది. HYD కు చెందిన అశోక్(35) నలుగురు స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు నది తీరానికి వచ్చారు. ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడిన అశోక్ కనిపించకుండాపోయినట్లు స్నేహితులు తెలిపారు. అశోక్ ఆచూకీ కోసం స్థానికులతోకలిసి స్నేహితులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ ఇంకా లభించలేదు.

Similar News

News February 21, 2026

NTR: రూ.కోట్ల స్కామ్.. పార్టీ కండువా మార్చి తప్పించుకుంటారా?

image

NTR(D) పెనుగంచిప్రోలు పంచాయతీలో రూ.1.21కోట్ల నిధుల మళ్లింపు కలకలం రేపుతోంది. దీనిపై వివరణ ఇవ్వాలని సర్పంచ్ పద్మకుమారికి DPO నోటీసులు జారీ చేశారు. సర్పంచ్ భర్త, YCP రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ నిధుల గోల్‌మాల్ కేసు నుంచి తప్పించుకునేందుకు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. TDPలోకి వెళ్లాలని ప్రయత్నించినా స్థానిక MLA అడ్డు చెప్పడంతో, JSP నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

News February 21, 2026

అవకాడో సాగు.. మొక్కలు నాటే విధానం

image

వసంతకాలంలో తగినంత ఉష్ణ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అవకాడో అంటుకట్టిన మొక్కలను లేదా మొగ్గ తొడిగిన మొక్కలను నాటాలి. 1x1x1 అడుగుల పొడవు, వెడల్పు, లోతు ఉండే విధంగా గుంతలను తవ్వుకొని 1 : 1 : 1 నిష్పత్తిలో మట్టి, ఇసుక మరియు పశువుల ఎరువుల మిశ్రమాన్ని నింపాలి. అనంతరం మొక్కలను నాటుకోవాలి. వరుసలలోని 2 మొక్కలకి మధ్య దూరం 15- 20 అడుగులు ఉండాలి. రెండు వరుసలకు మధ్య 20 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి.

News February 21, 2026

కర్నూలు WDCWలో ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

image

AP: కర్నూలు మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ (WDCW)లో 13పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLM/సోషల్ వర్క్/సోషల్ సైన్స్/ సైకాలజీ, LLB, పారా మెడికల్ (డిగ్రీ/డిప్లొమా), డిగ్రీ, డిప్లొమా, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18-39ఏళ్ల మధ్య ఉండాలి. జీతం రూ.13000-రూ.34,000 వరకు చెల్లిస్తారు. సైట్: https://kurnool.ap.gov.in./