News September 1, 2024
సోమశిల జలాశయంలో చేపల వేట నిషేధం ఎత్తివేత
అనంతసాగరం మండలం సోమశిల జలాశయంలో జూలై నుంచి ఆగస్టు 31 వరకు చేపలు వేట నిషేధం విధితమే. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి చేపల వేట నిషేధం ఎత్తివేస్తున్నట్లు మత్స్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు శనివారం తెలిపారు. జలాశయంలో చేపల వేట చేస్తున్న వారికి లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిషేధం సమయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News January 14, 2025
నెల్లూరు: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందిన ఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. వెంకటాచలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇందుకూరుపేట(M), లేబూరుకు చెందిన కాలేషా(45), అతని కొడుకు హమీద్(12) మృతి చెందారు. మనుబోలులో జరిగిన రోడ్డుప్రమాదంలో సైదాపురం(M), గంగదేవిపల్లికి చెందిన సుబ్బయ్య(34), శంకరయ్య(39)దుర్మరణం చెందారు. గుడ్లూరులో జరిగి రోడ్డుప్రమాదంలో రాపూరుకు చెందిన వెంకటేశ్వర్లు(60), హార్దిక రాజ్(4) మరణించారు.
News January 14, 2025
సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలని సీఎంకు ఆహ్వానం
సీఎం చంద్రబాబును సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ నారావారిపల్లిలో కలిశారు. ఈ మేరకు ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలని సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
News January 14, 2025
సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలని సీఎంకు ఆహ్వానం
సీఎం చంద్రబాబును సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ నారావారిపల్లిలో కలిశారు. ఈ మేరకు ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ రావాలని సీఎంకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.