News September 21, 2025

సోమశిల జలాశయానికి 50వేల క్యూసెక్కుల వరద

image

సోమశిల జలాశయానికి భారీగా వరద పెరుగుతుంది. ఆదివారం ఎగువ ప్రాంతాల నుంచి 50,138 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా 73.246 TMCల నీటిమట్టం నమోదైంది. జలాశయం క్రస్ట్ గేట్లు ఎత్తి పెన్నాడెల్టాకు 47,200, కండలేరుకు 10,200 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఛైర్మన్ వేలూరు కేశవ చౌదరి, అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.

Similar News

News September 28, 2025

నెల్లూరు: రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వారికి కౌన్సెలింగ్

image

జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు, నేరచరిత్ర కలిగిన వారికి పోలీసు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజా శాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని, ఎవ్వరిని ఉపేక్షించమని, పద్ధతులు మార్చుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలో నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు.

News September 28, 2025

నెల్లూరు: బంగారం పేరుతో మోసం

image

జిల్లాలో బంగారం పేరుతో మోసాలు పెరుగుతున్నాయి. తవ్వకాల్లో బంగారం బయటపడిందని, తక్కువ ధరకే ఇస్తామని నమ్మించి ముఠాలు ప్రజలను ఉడాయిస్తున్నాయి. స్టోన్ హౌస్ పేటకు చెందిన వ్యక్తి కర్ణాటకలో బంగారం ఉందని నమ్మి వెళ్లగా, నకిలీ పోలీసుల చేతిలో రూ.60 లక్షలు పోగొట్టుకున్నాడు. జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ నమోదవుతున్నాయి. బంగారం ధరలు పెరగడంతో మోసగాళ్లు కొత్త పద్ధతులు అవలంబిస్తూ అమాయకులను దోచుకుంటున్నారు.

News September 28, 2025

నెల్లూరు: దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారాయణ

image

మంత్రి నారాయణ ఆదివారం దక్షిణ కొరియా పర్యటనకు తరలి వెళ్లారు. సుస్థిర నగరాల నిర్మాణం, అధ్యయనం పెట్టుబడుల సాధన కోసం ఆయన సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి దక్షిణ కొరియాలోని నామీ ద్వీపానికి చేరుకున్నారు. నామీ ద్వీపం సీఈవో మిన్ క్యోంగ్ వూ( min keyong woo)తో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. నామీ ద్వీపం అభివృద్ధి, పర్యాటకులను ఆకట్టుకునేందుకు తీసుకున్న చర్యలపై సీఈవోతో మంత్రి నారాయణ చర్చించారు.