News January 7, 2026

సోమిరెడ్డి అవినీతి రూ.100కోట్లు: కాకాణి

image

సోమిరెడ్డి నీతిమాలిన మాటలు విని భవిష్యత్తులో ఉద్యోగులు ఇబ్బంది పడొద్దని మాజీ మంత్రి కాకాణి సూచించారు. ‘సోమిరెడ్డి చెప్పారనే వెంకటాచలం సర్పంచ్‌ను డీపీవో శ్రీధర్ రెడ్డి తొలగించారు. పోలీసులు లేకుండా MLA గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు కుక్కను కొట్టినట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క ఇరిగేషన్ శాఖలోనే సోమిరెడ్డి రూ.100కోట్ల అవినీతి చేశారు’ అని కాకాణి ఆరోపించారు.

Similar News

News February 20, 2026

నెల్లూరు వాసికి కీలక పదవి

image

నెల్లూరుకు చెందిన ఆడిటర్ ముప్పాల సుబ్బారావుకు కీలక పదవి లభించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) సౌత్ రీజినల్ కౌన్సిల్ ఛైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ఆయన చెన్నైలో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. త్వరలో ఆయనకు నెల్లూరులో సన్మానం చేస్తామని అడ్వకేట్ పర్వేజ్ ప్రకటించారు.

News February 20, 2026

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని 11 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించే ఈ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పాఠశాలల్లో 2024-25, 2025-28 విద్యా సంవత్సరంలో నిరవధికంగా చదివి ఉండాలని తెలిపారు. ఈ నెల 23 నుంచి మార్చి 31వ తేదీలోపు గేట్ వే ద్వారా ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు.

News February 20, 2026

నెల్లూరు: గురుకుల పాఠశాలలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి

image

బుచ్చి(మం) రామచంద్రపురం గురుకుల పాఠశాలలో కరెంటు షాక్ తగిలి ఓ కూలి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీపై ఇనుప ముల్ల కంచె ఏర్పాటు చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ కూలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే బుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.