News October 18, 2025

సోలార్ యూనిట్లు ప్రోత్సహించాలి: కలెక్టర్

image

జిల్లాలో సోలార్ యూనిట్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం మాట్లాడుతూ.. దీపావళి రోజు వాతావరణం కలుషితం చెయ్యని క్రాకర్స్‌ను మాత్రమే వెలిగించాలని ప్రజలకు సూచించారు. అన్ని రంగాల్లోనూ జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా అధికారులు కృషి చెయ్యాలని కోరారు.

Similar News

News October 19, 2025

ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. రోకోపైనే అందరి దృష్టి

image

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా ఇవాళ తొలి వన్డే ఆడనుంది. ODI కెప్టెన్‌గా గిల్‌కిదే తొలి మ్యాచ్ కాగా AUSను ఎలా ఎదుర్కొంటాడో అనేది ఆసక్తిగా మారింది. 7 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్, కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది. కీలక ప్లేయర్లు అందుబాటులో లేకున్నా స్వదేశంలో ఆసీస్‌ను తక్కువ అంచనా వేయలేం. మ్యాచ్ 9amకు ప్రారంభమవుతుంది. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.

News October 19, 2025

మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పెంపు

image

TG: నూతన మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఎక్సైజ్ శాఖ ఈ నెల 23 వరకు పొడిగించింది. బ్యాంకులు, నిన్న బీసీ బంద్ నేపథ్యంలో దరఖాస్తు చేయలేకపోయామన్న ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ నెల 23న తీయాల్సిన డ్రాను 27కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న ఒక్క రోజే 30వేలకు పైగా దరఖాస్తులు రాగా మొత్తంగా 80వేలు దాటినట్లు అధికారులు వెల్లడించారు.

News October 19, 2025

ASF: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

నిరుపేదల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధి పొందిన వారు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం ASF కలెక్టరేట్ సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పంచాయతీ కార్యదర్శుల హాజరు అంశాలపై సమీక్ష నిర్వహించారు.