News August 18, 2025
‘సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలి’

ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు నిర్ణీత నమూనాలో సమర్పించాలని అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుపై సోమవారం అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 4,700 కు పైగా ప్రభుత్వ కనెక్షన్ లు ఉన్నాయనీ, 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేశారన్నారు.
Similar News
News August 18, 2025
హక్కుల సాధనకు సంఘటితమవుదాం

విచ్ఛిన్నకర శక్తులకు శాంతి మార్గంలో తగిన గుణపాఠం చెప్పేందుకు తమ రాజ్యాంగ పరిరక్షణ వేదిక ముందుకు సాగుతోందని జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ అన్నారు. సోమవారం ఖమ్మం నిజాంపేట ప్రాంత నూతన కమిటీని ఎన్నుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. హక్కుల సాధనకు సంఘటితమవుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
News August 18, 2025
వందేళ్ల వృద్ధురాలి భౌతికకాయం దానం

మధిర పట్టణం బంజారా కాలనీకి చెందిన రమావత్ మంగమ్మ(100) సోమవారం మృతి చెందారు. ఈమె మృతదేహాన్ని వైద్య విద్యార్థుల బోధన-అభ్యసన అవసరాల నిమిత్తం ఖమ్మంలోని వైద్య కళాశాలకు అందించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాళి అర్పించారు. ఈమె జీవితమంతా శ్రీరాముడి భక్తిలో గడిపి, స్థానిక ఆలయానికి ఎంతో సేవ చేశారని పలువురు గుర్తు చేసుకున్నారు.
News August 18, 2025
సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: హేమంతరావు

సీపీఐ నాలుగో రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాగం హేమంతరావు కోరారు. సోమవారం వైరా మండలంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 20 నుంచి 22 వరకు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో ఈ మహాసభలు జరుగుతాయన్నారు. ఈ మహాసభలల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.