News August 21, 2025
సోషల్ మీడియాకు దూరంగా ఉండండి: కలెక్టర్

విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో హాస్టల్ నిర్మాణానికి ఆయన గురువారం భూమిపూజ చేశారు. తల్లితండ్రుల కలను నెరవేర్చడమే విద్యార్థుల లక్ష్యమన్నారు. ఓ టార్గెట్ పెట్టుకుని దానిని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. విద్యపై చేసే ఖర్చు ఎప్పటికీ వృథా కాదన్నారు.
Similar News
News August 20, 2025
హంద్రీనీవా కాలువను పరిశీలించిన కలెక్టర్

హంద్రీనీవా కుప్పం కెనాల్ పనులను బుధవారం చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. హంద్రీనీవా కాలువ పనులు దాదాపు పూర్తికాగా పనుల పురోగతికి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో సీఎం చంద్రబాబు హంద్రీనీవా జలాలను కుప్పంకు విడుదల చేయనున్నారు. దీంతో చివరి దశలో ఉన్న పనులను త్వరతగితన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News August 20, 2025
CTR: వినాయక విగ్రహాలకు పర్మిషన్ ఇలా పొందండి

చిత్తూరు జిల్లాలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
➤<
➤ఫోన్ నంబర్ టైప్ చేసి ఓటీపి ఎంటర్ చేయండి
➤ తర్వాత అక్కడ అడిగే అన్ని వివరాలు నమోదు చేసి సబ్‌మిట్ చేయండి.
NOTE: అప్లికేషన్‌లో విగ్రహం సైజ్ ఎంతో చెప్పాల్సి ఉంటుంది. ముందుగానే విగ్రహాన్ని బుక్ చేసుకోండి.
News August 20, 2025
CTR: వేంకన్న పాదం పెట్టిన స్థలం గురించి తెలుసా?

చిత్తూరు జిల్లా రొంపిచర్ల-ఎం.బెస్తపల్లి మార్గంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. భక్తులు చిన్నగుడి కట్టి పూజలు చేస్తున్నారు. పెరటాసి నెల శనివారాల్లో ఇక్కడ పూజలు ఘనంగా జరుగుతాయి. తిరుమల వెళ్తూ శ్రీవారు ఇక్కడ ఎడమ పాదం మోపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రదేశాన్ని వేంకటేశుని పాదం అని పిలుస్తున్నారు. ఇక్కడి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. TTD స్పందించి అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.