News February 3, 2025
సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు వద్దు: ఎస్పీ

వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఈనెల 28 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారి తీసే సమావేశాలు, జన సమూహం చేయడం పూర్తిగా నిషేధమని అన్నారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలను, రాజకీయ నాయకుల, కుల మతాల మధ్య చిచ్చుపెట్టే అంశాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Similar News
News November 9, 2025
MNCL: అండర్-14 క్రికెట్ బాలుర జిల్లా స్థాయి ఎంపిక పోటీలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాలలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో అండర్-14 క్రికెట్ బాలుర జిల్లా స్థాయి ఎంపిక పోటీలు జరిగాయి. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని జోనల్ స్థాయికి ఎంపిక చేయనున్నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎండీ యాకుబ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోటీల కన్వీనర్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
News November 9, 2025
GWL: ఆర్డీఎస్‌ను పటిష్ఠం చేయాలి..!

టీబీ డ్యామ్ ద్వారా అలంపూర్ నియోజకవర్గానికి సాగునీరు అందించే (రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) ఆర్డీఎస్ ఆనకట్టను పటిష్ఠ పరచాలని అలంపూర్ రైతులు అంటున్నారు. చాలా కాలం క్రితం నిర్మించిన ఆనకట్ట బకెట్ వ్యవస్థ దెబ్బతింది. భారీ వరదకు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. బకెట్ వ్యవస్థ పటిష్ఠతకు గతంలో పనులు ప్రారంభించినా పూర్తి చేయలేదు. ఈ ఏడాది వేసవి కాలంలో బకెట్ వ్యవస్థను పటిష్ఠం చేయాలని రైతులు ప్రభుత్వాలను కోరుతున్నారు.
News November 9, 2025
ఘట్టమనేని జయకృష్ణ మూవీ ప్రారంభం

దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఆయన మనవడు ఘట్టమనేని జయకృష్ణ(రమేశ్ బాబు కుమారుడు) ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. #AB4 వర్కింగ్ టైటిల్‌తో అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. గొప్ప ప్రేమ కథతో ఈ సినిమా రూపొందనుందని డైరెక్టర్ తెలిపారు.


