News February 12, 2025
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చర్యలు: SP

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని అన్నారు. సోషల్ మీడియాను ఐటి పోలీసులు పరిశీలిస్తూ ఉంటారని చెప్పారు.
Similar News
News January 29, 2026
HYDలో ఎయిర్ క్వాలిటీ @236

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున టీచర్స కాలనీలో 236గా ఉంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 15 రోజులతో పోలిస్తే ఇవాళ ఒక్కసారిగా గాలి నాణ్యత క్షిణించింది.
News January 29, 2026
ప.గో: బార్ లైసెన్సులకు నోటిఫికేషన్ విడుదల

పశ్చిమ గోదావరి జిల్లాలోని 8 బార్లకు సంబంధించి జిల్లా అబ్కారీ శాఖ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సాపురం(1), తణుకు(3), తాడేపల్లిగూడెం(4) మున్సిపాలిటీల పరిధిలోని ఈ బార్లకు ఫిబ్రవరి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఒక్కో బార్‌కు కనీసం 4 దరఖాస్తులు రావాలని, ఆసక్తి ఉన్నవారు ఎన్ని అప్లికేషన్లు అయినా సమర్పించవచ్చని స్పష్టం చేశారు.
News January 29, 2026
మేడారం జాతరలో మహిళ ప్రసవం

TG: మేడారం వనదేవతల సన్నిధిలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. HYD మౌలాలీకి చెందిన నిండు గర్భిణి రజిత జాతరకు వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున ఆమెకు పురిటి నొప్పులు మొదలవడంతో మేడారంలోని ప్రధాన ఆస్పత్రికి తరలించారు. DMHO డా.అప్పయ్య పర్యవేక్షణలో వరంగల్ CKM ఆస్పత్రి వైద్యులు రమ్య, నికిత ఆమెకు సుఖప్రసవం చేశారు. రజిత మగబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.


