News March 28, 2024

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు:SP

image

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫొటోలు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.

Similar News

News January 11, 2025

NLG: జర్మనీలో డ్రైవర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

image

జర్మనీ దేశంలో బస్ డ్రైవర్లుగా పనిచేయడానికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ కింద రిక్రూట్మెంట్ ఏజెన్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. బస్ డ్రైవర్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు రెండు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవంతో లైసెన్స్ కలిగి ఉండాలని, 24 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని అన్నారు.

News January 10, 2025

NLG: భర్త బర్త్ డే.. అవయవదానంపై భార్య సంతకం

image

బర్త్ డే అయితే సాధారణంగా అన్నదానం, పండ్లు పంపిణీ లాంటి కార్యక్రమాలు చేస్తుంటాం. కానీ నల్గొండకు చెందిన శ్రీకాంత్, లహరి దంపతులు వినూత్నంగా ఆలోచించారు. జన్మదినం కావడంతో శ్రీకాంత్ నల్గొండ రెడ్ క్రాస్ భవన్‌లో రక్తదానం చేయగా, ఆయన భార్య లహరి అవయవ దానం ప్రతిజ్ఞ పత్రాలపై సంతకం చేశారు. వారిని రెడ్ క్రాస్ ఛైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి అభినందించారు. 

News January 10, 2025

నల్గొండ: ముగ్గును ముద్దాడిన వానరం 

image

మర్రిగూడ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు ముందస్తుగా సంక్రాతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు విభిన్న రంగులతో ముగ్గులు వేశారు. పాఠశాల ఆవరణం అంతా తీరొక్క రంగులతో మెరిసిపోయింది. అయితే అక్కడికి వచ్చిన ఓ వానరం ముగ్గులను ముద్దాడుతూ కనిపించింది. అక్కడున్న వారంతా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్వరూప రాణి, సిబ్బంది పాల్గొన్నారు.