News March 29, 2024
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు: ఎస్పీ రాహుల్ హెగ్డే

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని విద్వేషకర పోస్టులు పెట్టే వారి సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
Similar News
News April 21, 2025
NLG: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు మంగళవారం విడుదల చేయనుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 58,228 మంది (మొదటి సంవత్సరంలో 28,840 మంది, రెండవ సంవత్సరంలో 29,338 మంది) విద్యార్థుల భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST
News April 21, 2025
NLG: డిజిటల్ ఫీడ్ బ్యాక్‌కు కానరాని స్పందన

ఠాణాలకు వచ్చే పౌరులతో పోలీసుల వ్యవహారశైలి, వారందించే సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇందుకోసం సీఐడీ రూపొందించిన ‘క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను అమల్లోకి తెచ్చినా ప్రజల నుంచి స్పందన కానరావడం లేదు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లకు వచ్చే వారికి క్యూఆర్ కోడ్ పట్ల అవగాహన కల్పించకపోవడం వలన ఇది నిరుపయోగంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి.
News April 21, 2025
NLG: 22 నుంచి మరోసారి ఇందిరమ్మ ఇళ్ల సర్వే..!

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం రెండో విడత సర్వేకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల మొదటి విడత సర్వే పూర్తి చేసిన అధికారులు (ఎల్-1, ఎల్-2, ఎల్-3) కేటగిరీలుగా విభజించారు. ఎల్-1 కేటగిరీ వారికి మొదట ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఎల్-1 కేటగిరీలో ఎక్కువ మంది ఉండడంతో వారిలో నిజమైన అర్హులను గుర్తించేందుకు రెండో విడత సర్వే ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది.