News September 21, 2025

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు: ఎస్పీ

image

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలపైన కానీ, కులమతాల పైనగాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. అలాంటి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ మేరకు కదిరికి చెందిన అంజాద్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. ఆయనపై ఐదు కేసులు నమోదు చేసి జైలుకు పంపామని తెలిపారు.

Similar News

News September 21, 2025

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బీచ్ ఫెస్టివల్ ప్రచారం: కలెక్టర్

image

బాపట్ల కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ సూర్యలంక బీచ్ ఫెస్టివల్, ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రచారానికి ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాపట్ల, చీరాల, ఇంకోల్లు, గుంటూరు ప్రాంతాల నుంచి 35కి పైగా ఇన్‌ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు. వారు ఏపీ టూరిజం సహకారంతో తీరప్రాంత సౌందర్యం, సాంస్కృతిక వైభవాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రోత్సహించేందుకు అంగీకరించారు.

News September 21, 2025

అవాంఛనీయ ఘటనలు లేకుండా చూడాలి: కలెక్టర్

image

ఈ నెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటకల నుంచి కూడా భక్తులు భారీగా వస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.

News September 21, 2025

జీవీఎంసీలో రేపు పీజీఆర్ఎస్ రద్దు

image

జీవీఎంసీలో ప్రతి సోమవారం నిర్వహించే పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని రేపు రద్దు చేస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. విశాఖలో రెండు రోజులపాటు ఈ గవర్నెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడును ఆ సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు.