News November 13, 2024

సోషల్ మీడియా యూజర్లకి విశాఖ సీపీ హెచ్చరిక

image

విశాఖ జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, సోషల్ మీడియా యూజర్లకు హెచ్చరికతో పాటు సూచనలు తెలియజేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు, కులమతాల విద్వేషాలను, ఉద్దేశపూర్వకంగా వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నకిలీ ఖాతాలతో పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే డయల్ 112కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యాలని కమిషనర్ తెలిపారు.

Similar News

News November 11, 2025

విశాఖలో విషాద ఘటన

image

మద్యానికి బానిసైన కొడుకును కన్న తండ్రి హతమార్చిన ఘటన విశాలాక్షి నగర్లో చోటు చేసుకుంది. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 6వ తేదీన మద్యానికి డబ్బులు కావాలని వై.ప్రసాద్ (36) తండ్రి లక్ష్మణరావును వేధించాడు. కోపోద్రిక్తుడైన తండ్రి కొడుకు తలపై కర్రతో బలంగా కొట్టడంతో మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టాడు. మృతుని భార్య రాజీ ఫిర్యాదుతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

News November 10, 2025

భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లు పూర్తికావాలి: కలెక్టర్

image

ఈ నెల 14,15వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న భాగ‌స్వామ్య స‌దస్సు ఏర్పాట్లు 12వ తేదీ సాయంత్రం నాటికి పూర్తికావాల‌ని అధికారుల‌కు క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్రసాద్ నిర్దేశించారు. క‌లెక్టరేట్లో అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ఎక్క‌డా ఎలాంటి స‌మ‌న్వ‌య లోపం రాకుండా అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొన్నారు. స‌దస్సులో ఉపరాష్ట్రప‌తి, గవ‌ర్న‌ర్, సీఎం, కేంద్రమంత్రులు భాగ‌స్వామ్యం కానున్నార‌ని సూచించారు.

News November 10, 2025

గోపాలపట్నంలో వివాహిత అనుమానాస్పద మృతి

image

గోపాలపట్నం సమీపంలో రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్న శ్యామల అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పది నెలల క్రితం వేపాడ దిలీప్ శివ కుమార్‌తో వివాహం కాగా తల్లిదండ్రులు భారీగానే ఇచ్చారు. సోమవారం శ్యామల చనిపోయినట్లు సమాచారం అందడంతో తల్లి వచ్చి చూసి ముఖం పైన బలమైన గాయాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతుర్ని అల్లుడు, బంధువులే చంపేశారని ఫిర్యాదు చేశారు. మృతురాలి శ్యామల నేవిలో ఉద్యోగం చేస్తోంది.