News April 4, 2024
సోషియల్ మీడియాలో అసభ్య పోస్టులపై నిఘా ఉంచండి: సత్యసాయి ఎస్పీ

ఎన్నికలవేళ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వస్తున్న పోస్టులు పెడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోషల్ మీడియా సైబర్ క్రైమ్ కార్యాలయాన్ని ఎస్పీ పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోస్టులు పెట్టే వారు నిబంధనలకు లోబడి పోస్టు చేసుకోవాలన్నారు.
Similar News
News February 16, 2026
బిల్ గేట్స్ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న కలెక్టర్

అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులతో కలిసి బిల్ గేట్స్ బృందంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతపురం కలెక్టరేట్ ఎన్ఐసీ భవనం నుంచి జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ వర్చువల్ విధానంలో ఈ భేటీకి హాజరయ్యారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పాలనలో సాంకేతికతను జోడించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ఈ సమావేశం దిశానిర్దేశం చేసింది.
News February 16, 2026
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్

రేపు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని జిల్లాలో సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు.
News February 16, 2026
అనంత: PGRS రద్దు.. కారణం ఇదే.!

ఈనెల 16న జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. CM ఆధ్వర్యంలో మంత్రులు, సెక్రటరీలతో కలిసి బిల్గేట్స్ బృందంతో విజయవాడలో సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయుల్లో కూడా కార్యక్రమాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు.


