News December 12, 2025
సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం: లోకేశ్

‘అఖండ-2’లో బాలా మామయ్య నట తాండవం ప్రేక్షకులను కనువిందు చేయనుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘God of Masses మూవీ అంటే సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం. ఈ మూవీ అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నా. 5 దశాబ్దాల సినీ చరిత్రలో మరో ఘనవిజయం సొంతం చేసుకోబోతున్న మామయ్యకు అభినందనలు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. అఖండ-2 రేపు విడుదల కానుండగా, ఇప్పటికే ప్రీమియర్స్ మొదలయ్యాయి.
Similar News
News December 16, 2025
సిరీస్ మధ్యలో బుమ్రా ఎందుకు ముంబై వెళ్లారు?

IND vs SA T20 సిరీస్ మధ్యలో జస్ప్రీత్ బుమ్రా జట్టు నుంచి తప్పుకోవడం వెనుక వ్యక్తిగత కారణాలున్నట్లు BCCI వెల్లడించింది. అత్యంత సన్నిహిత వ్యక్తి హాస్పిటల్‌లో చేరడంతో వెంటనే ముంబైకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. మూడో T20 టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పరిస్థితి మెరుగుపడితే 4 లేదా 5వ మ్యాచ్‌కు బుమ్రా తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని BCCI అధికారి తెలిపారు.
News December 16, 2025
25 లక్షలు దాటిన శబరిమల దర్శనాలు

కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో శబరిమల మారుమోగుతోంది. నవంబర్ 16 నుంచి నిన్నటి వరకు రికార్డు స్థాయిలో 25+ లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 21 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా మండల పూజా మహోత్సవాలు ఈ నెల 27తో ముగియనున్నాయి.
News December 16, 2025
జింకు ఫాస్పేట్ ఎరతో ఎలుకల నివారణ

ఎలుకల వల్ల పంట నష్టం ఎక్కువగా ఉంటే పంట కాలంలో ఒక్కసారి మాత్రమే జింకు ఫాస్పేట్ ఎరను వాడాలి. దీనికి ముందుగా విషం లేని ఎరను 20 గ్రాములు (98శాతం నూకలు, 2శాతం నూనె) పొట్లాలుగా చేసి ఎలుక కన్నానికి ముందు ఒకటి చొప్పున ఉంచాలి. ఇలా ఎలుకకు 2 రోజులు అలవాటు చేసి 3వరోజు జింకు ఫాస్పేట్ ఎరను 10 గ్రాములు (96% నూకలు, 2% నూనె, 2% మందు) పొట్లాలుగా కట్టి ఎలుక కన్నంలో ఒకటి చొప్పున వేయాలి. ఇవి తిన్న ఎలుకలు మరణిస్తాయి.


