News January 9, 2026

సౌతాఫ్రికాలో చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు!

image

సౌతాఫ్రికాలో రేపటి నుంచి బ్రిక్స్ దేశాల నేవల్ డ్రిల్స్‌ జరగనున్నాయి. ఇందుకోసం చైనా, రష్యా, ఇరాన్ యుద్ధ నౌకలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. బ్రిక్స్ మధ్య సహకారాన్ని మరింత పెంచుకోవడానికి కూటమి సభ్యులను ఒకచోటుకు చేర్చుతామని సౌతాఫ్రికా చెప్పింది. UAE తమ నౌకలను, ఇండోనేషియా, ఇథియోపియా, బ్రెజిల్ అబ్జర్వర్లను పంపుతున్నట్లు తెలిపింది. ఇండియా, ఈజిప్ట్, సౌదీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Similar News

News February 20, 2026

ఇంటి చిట్కాలు

image

* కొవ్వొత్తులను వెలిగించే ముందు వాటి పైభాగాన కాస్త ఉప్పు రాస్తే ఎక్కువ సమయం వెలుగుతాయి.
* చెత్తబుట్టలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. బుట్ట అడుగు భాగంలో కొంచెం బొరాక్స్‌ పొడి చల్లాలి.
* కాస్త వెనిగర్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి డైనింగ్ టేబుల్ తుడిస్తే ఎలాంటి మరకలైనా పోతాయి.
* ట్యాపులపై ఉండే మచ్చలు పోయి కొత్తవాటిలా మెరవాలంటే వారానికోసారి నిమ్మకాయ ముక్కతో రుద్దాలి.

News February 20, 2026

యంగ్ హీరోతో అనుపమ డేటింగ్?

image

అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ అవార్డుల ఫంక్షన్‌లో వీరిద్దరూ సెల్ఫీ తీసుకోగా దాన్ని ధ్రువ్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. అనుపమ ఆ పోస్ట్‌ను రీషేర్ చేస్తూ లవ్ సింబల్ జోడించారు. అంతకుముందు ఓ వేడుకలోనూ రాత్రి 2 గంటలకు ఫోన్ చేయాల్సి వస్తే ఇండస్ట్రీలో ఎవరికి చేస్తారని అడగగా ధ్రువ్‌కి చేస్తా అని అనుపమ చెప్పారు. వీరిద్దరూ గతేడాది ‘బైసన్’ సినిమాలో నటించారు.

News February 20, 2026

వయసు కంటే వ్యక్తి.. కులం కంటే క్యారెక్టర్: మారిన పెళ్లి ట్రెండ్!

image

ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్‌లో పదేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. ‘జీవన్‌ సాథీ’ ప్రకారం.. 2016-2025 మధ్య పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టే సగటు వయసు 27 నుంచి 29 ఏళ్లకు చేరింది. నేటి యువత ‘సరైన వయసు’ కంటే ‘సరైన వ్యక్తి’నే ప్రిఫర్ చేస్తున్నారు. గతంలో 91% మంది కులానికి ప్రాధాన్యం ఇస్తే.. ఇప్పుడు అది 54%కి పడిపోయింది. ‘డ్యూయల్ ఇన్‌కమ్’ సంస్కృతి పెరిగింది. ఆర్థిక భద్రత కంటే ఎమోషనల్ బాండింగ్‌కే ఓటేస్తున్నారు.