News January 19, 2026
సౌత్ ఇండియన్ సైన్స్ ఫెయిర్‌లో ర్యాలమడుగు ఉపాధ్యాయుడు

నిజాంపేట మండలం ర్యాలమడుగు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వినయ్ కుమార్ సైన్స్ ప్రదర్శనలో తన ప్రతిభను చాటారు. తెలంగాణ ఉపాధ్యాయ విభాగంలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికైన ఆయన కొల్లూరులో నిర్వహిస్తున్న దక్షిణ భారతదేశ వైజ్ఞానిక ప్రదర్శనలో ఇంటరాక్టివ్ మ్యాథ్స్ కార్నర్ ప్రదర్శించారు. గణితంలో వినూత్న బోధనలతో సత్తా చాటుతున్నారు. ఖేడ్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ ఆచార్య, జైపాల్ రెడ్డి అభినందించారు.
Similar News
News February 5, 2026
రైతులకు రిటర్న్ ప్లాట్‌లు.. 16న లాటరీ

AP: రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకు రిటర్న్ ప్లాట్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈనెల 16న ప్లాట్‌ల కేటాయింపునకు CRDA లాటరీ తీయనుంది. ఈ-లాటరీ ద్వారా రైతులకు నిబంధనల ప్రకారం ప్లాెెట్‌లు కేటాయిస్తారు. వాటిని రైతులు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
News February 5, 2026
సిద్దిపేట: కమిషనరేట్ పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 7 నుంచి 22 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించడం నిషిద్ధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.
News February 5, 2026
కామారెడ్డి: ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్‌ను ఎన్నికల పరిశీలకుల అధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ సూపర్‌వైజర్లను ఎంపిక చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, మధుమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు పాల్గొన్నారు.


