News December 22, 2025
సౌదీలో లిక్కర్ కిక్కు.. రహస్యంగా..

ఇస్లాం దేశం అయిన సౌదీలో రూల్స్ మారుతున్నాయి. రియాద్‌లోని ‘డిప్లొమాటిక్ క్వార్టర్’లో ఉన్న ఓ దుకాణంలో అత్యంత రహస్యంగా నాన్-ముస్లిం విదేశీయులకు మద్యం విక్రయిస్తున్నారు. కాగా 1950లో సౌదీలో మద్యాన్ని బ్యాన్ చేశారు. దీంతో కొందరు చుట్టుపక్కల దేశాలకు వెళ్లి లిక్కర్ ఎంజాయ్ చేసేవారు. క్రూడ్ ఆయిల్‌కు ప్రత్యామ్నాయంగా పర్యాటక ఆదాయం కోసం సౌదీ యువరాజు కఠినమైన నిబంధనలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు.
Similar News
News December 22, 2025
‘నిజమైన క్రైస్తవ రాజకీయాలు’.. H-1B ఆంక్షలపై జేడీ వాన్స్

H-1B వీసా ప్రోగ్రామ్‌పై ఆంక్షలు విధించడాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించుకున్నారు. విదేశీ ఉద్యోగుల నియామకాన్ని పరిమితం చేయడం తమ నిజమైన క్రిస్టియన్ రాజకీయాలకు మూలమని అన్నారు. ఇది అమెరికన్ల శ్రమ, ఆర్థిక గౌరవానికి ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. <<18413451>>థర్డ్ వరల్డ్<<>> దేశాల చీప్ ఆప్షన్స్ కోసం అమెరికన్ లేబర్‌ను కంపెనీలు పట్టించుకోవడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
News December 22, 2025
మొన్న ఒమన్, నేడు న్యూజిలాండ్.. ఇండియాతో ట్రేడ్ డీల్!

ఇండియాతో న్యూజిలాండ్ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. 2 దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకున్నాయని, తమ ఎగుమతులపై సుంకాలు తగ్గుతాయి/పూర్తిగా తొలగిపోతాయని NZ PM క్రిస్టోఫర్ లక్సన్ తెలిపారు. ఈ డీల్‌తో 20 ఏళ్లలో భారత్‌కు తమ ఎక్స్‌పోర్ట్స్ ఏడాదికి $1.1 బిలియన్ల నుంచి $1.3 బిలియన్ల వరకు పెరుగుతాయని పేర్కొన్నారు. 95% వస్తువులపై సుంకాలు తగ్గుతాయి/తొలగుతాయని తెలిపారు. ఇటీవల ఒమన్‌తోనూ భారత్ ఒప్పందం చేసుకుంది.
News December 22, 2025
అంటే.. ఏంటి? Extravaganza

విలాసం, కనువిందుగా కార్యక్రమం జరిగింది అని చెప్పే సందర్భంలో ఈ పదం వాడుతారు. ఇది ఇటాలియన్ భాషలోని Estravaganza పదం నుంచి పుట్టింది.
అంటే.. ఏంటి?లో రోజూ 12pmకు కొత్త పదం అర్థం, పద పుట్టుక వంటి వివరాలు తెలుసుకోండి.
<<-se>>#AnteEnti<<>>


