News November 17, 2025

సౌదీ యాక్సిడెంట్: 18 మంది రాంనగర్ వాసులు మృతి!

image

సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 18 మంది ముషీరాబాద్‌లోని రాంనగర్ వాసులు మృతి చెందారు. జమిస్తాన్‌పూర్ హై స్కూల్ వెనుక గల్లీలో ఉండే SK నసీరుద్దీన్ ఫ్యామిలీ ఉమ్రా యాత్రకు వెళ్లినట్లు ఆయన బంధువు అస్లాం Way2Newsకి తెలిపారు. మొత్తం కుటుంబంలో ఒక్కరు మాత్రమే మిగిలారని, అతడు ఈ టూర్‌కి వెళ్లనట్లు స్పష్టం చేశారు. ప్రాణాలతో ఉన్న ససీరుద్దీన్ కుమారుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు USలో ఉన్నట్లు అస్లాం చెప్పారు.

Similar News

News November 17, 2025

HYD: బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్

image

నగరంలో పెరుగుతున్న కాలనీలు, జనాభా, మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులు పెంచాలంటూ డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. కుత్బుల్లాపూర్, ఘట్కేసర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మొయినాబాద్ వంటి ప్రాంతాల వారు సరిపడ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు స్పందించి బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

image

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్‌‌వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.