News February 26, 2025
సౌర నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి: కలెక్టర్

మడకశిర, కదిరి ప్రాంతాలలో సౌర నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ సమావేశం నిర్వహించారు. 2025-26 ఏడాదికి సంబంధించి జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించారు. కంపెనీ అవసరాలకు అనుగుణంగా యువ నిపుణులను గుర్తించాలన్నారు.
Similar News
News February 27, 2026
రేపు, ఎల్లుండి ఏపీలో సీజేఐ పర్యటన

AP: CJI జస్టిస్ సూర్యకాంత్ 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి రానున్నారు. రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుపతిలో 16 కోర్టుల భవన నిర్మాణానికి ఎల్లుండి శంకుస్థాపన చేస్తారు. తర్వాత అమరావతికి చేరుకొని AP జుడీషియల్ అకాడమీ, హైకోర్టు గెస్ట్‌హౌస్‌లకు భూమిపూజ చేస్తారు. హైకోర్టు వద్ద నిర్మించిన న్యాయమూర్తుల నివాసాలను ప్రారంభిస్తారు. గవర్నర్ జస్టిస్ నజీర్, CM CBNతో కలిసి సభలో పాల్గొంటారు.
News February 27, 2026
అధికారులకు భద్రాద్రి ‘రామయ్య’ పరీక్ష..!

భద్రాద్రి రామనవమి వేడుకలు ఈసారి జిల్లా ఉన్నతాధికారులకు సవాల్‌గా మారనున్నాయి. బాధ్యతలు చేపట్టిన తర్వాత కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్‌కు ఇదే తొలి కళ్యాణ వేడుక. వీరితో పాటు EO దామోదర్‌రావు తొలిసారిగా ఈ వేడుకలను పర్యవేక్షించనున్నారు. 2019 బ్యాచ్‌కు చెందిన కలెక్టర్ అంకిత్ ఇప్పటికే ఏర్పాట్లపై దృష్టి సారించారు. కొత్త బృందానికి కళ్యాణ నిర్వహణ తొలి అనుభవం కావడంతో జిల్లావాసుల్లో ఆసక్తి నెలకొంది.
News February 27, 2026
ఏరుగట్లలో గుప్తనిధుల కలకలం..!

పెనుబల్లి మండలం ఏరుగట్లలో గుప్తనిధుల వేట కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి ముత్యాలమ్మ గుడి సమీపంలో క్షుద్రపూజలు నిర్వహిస్తూ, జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులు పట్టుబడ్డారు. ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకున్న వీఎం బంజర్ పోలీసులు..ఘటనా స్థలంలో జేసీబీ, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


