News January 24, 2026

స్కాట్లాండ్‌కు గోల్డెన్ ఛాన్స్

image

T20 వరల్డ్‌కప్‌లో స్కాట్లాండ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. భద్రతా కారణాల సాకుతో భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో ICC ఆ జట్టును తప్పించింది. దీంతో అత్యధిక ర్యాంకింగ్ ఉన్న <<18945385>>స్కాట్లాండ్‌<<>>కు అవకాశం దక్కింది. గ్రూప్‌ సీలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, నేపాల్‌, ఇటలీతో తలపడనుంది. దీంతో స్కాట్లాండ్ మంచి ప్రదర్శన కనబరిస్తే టాప్‌-8కు చేరే ఛాన్స్ ఉంది. ఇది ఆ దేశానికి వరుసగా ఐదో T20 WC కావడం విశేషం.

Similar News

News February 6, 2026

చౌడు నేలల్లో పంటలకు యూరియా ఇలా వేస్తే మేలు

image

నేలలో ఉదజని సూచిక 7 కంటే ఎక్కువ ఉంటే ఆ నేలలను చౌడు నేలలుగా పరిగణిస్తారు. ఈ మట్టిలోని లవణాల శాతం ఎక్కువుగా ఉంటే భూసారం తగ్గి, మొక్కకు అవసరమైన పోషకాలు అందవు. అయితే ఈ చౌడు నేలల్లో పండించే పంటలకు యూరియాను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేయడంతో పాటు యూరియాను పిచికారీ చేయాలి. నానో యూరియా వంటి ఎరువులను వాడటం వల్ల పంటల్లో మంచి దిగుబడి సాధించవచ్చంటున్నారు నిపుణులు.

News February 6, 2026

అవకాశం వచ్చినప్పుడు గెలిచి తీరాల్సిందే: సీఎం

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. మళ్లీ మళ్లీ పోటీ చేసే అవకాశం అందరికీ రాదని, పార్టీ టికెట్ ఇచ్చినపుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడతాయని, మనం చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలని సూచించారు.

News February 6, 2026

బంగ్లాలో ఘర్షణలు.. యూనస్ ఇంటి బయటే..!

image

ఎన్నికలకు 6 రోజుల ముందు బంగ్లాలో ఘర్షణలు చెలరేగాయి. దేశ సలహాదారు యూనస్ నివాసం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నేషనల్ పే స్కేల్ అమలు చేయాలని దేశంలోని ఉద్యోగులు ఢాకాలోని షహీద్ మినార్ నుంచి యూనస్ నివాసానికి ర్యాలీగా వచ్చారు. లోనికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి, వాటర్ క్యానన్స్, టియర్ గ్యాస్, సౌండ్ గ్రనేడ్లు ప్రయోగించారు. ఢాకా అంతటా భారీగా బలగాలను మోహరించారు.