News January 24, 2026
స్కాట్లాండ్ ఎంట్రీ.. కొత్త షెడ్యూల్ ఇదే

ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న T20WCలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఆడనున్నట్లు ICC ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను సవరించింది. గ్రూప్-Cలో స్కాట్లాండ్ ఉంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, 9న ఇటలీ, 14న ENG, 17న నేపాల్‌తో తలపడనుంది. మరోవైపు PM ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్న పాకిస్థాన్(PCB) స్థానంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. ఒకవేళ ఆ జట్టు తప్పుకుంటే పపువా న్యూ గినియా(PNG) ఆడే అవకాశం ఉంది.
Similar News
News April 13, 2026
నిధులిచ్చాం.. తేడా వస్తే మీ తప్పే: చంద్రబాబు

AP: పాఠశాలల పునః ప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లన్నీ పూర్తి వసతులతో సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి హాస్టల్ గాడిలో పడాలని… అన్ని రకాల వసతులు ఉండాలని సమీక్షలో స్పష్టం చేశారు. ఇప్పటికే నిధులు అందించామని అయినా ఫిర్యాదులు వస్తే అది అధికారుల తప్పిదమే అవుతుందన్నారు. హాస్టళ్లలో ఆహారం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం విషయంలో తేడా రాకుండా చూసుకోవాలని సూచించారు.

రిటైర్డ్ ఉద్యోగులకు అలర్ట్.. ఏప్రిల్ 30 వరకే..

AP: వివిధ శాఖల్లో రిటైరైన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ తదితరాలకు సంబంధించిన ఫైళ్లను మే1 నుంచి ఆన్‌లైన్(నిధి పోర్టల్)లోనే సమర్పించాల్సి ఉంటుంది. ఆర్థిక శాఖ ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. రిటైరైన ఉద్యోగుల పెన్షన్ ఫైళ్ల ఫిజికల్ కాపీలను APR30 వరకు మాత్రమే స్వీకరిస్తామని పేర్కొంది. ఆ తరువాత ఆఫ్‌లైన్‌లో అనుమతించేది లేదని తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగులకు ఇబ్బందులు రాకుండా దీన్ని గుర్తుంచుకోవాలని సూచించింది.