News November 22, 2025

స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు కొనసాగించండి: కలెక్టర్

image

కలెక్టర్ లక్ష్మిషా అధ్యక్షతన PCPNDT, DLMMAA, ART–Surrogacy అమలు పై సమీక్ష సమావేశం క్యాంపు కార్యాలయంలో జరిగింది. స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్ల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆడబిడ్డల సంరక్షణపై ప్రత్యేక పోస్టర్లు, గర్భిణీలకు యోగ–సుఖ ప్రసవంపై అవగాహన కల్పించాలన్నారు.కొత్త 12 స్కానింగ్ సెంటర్లు,19 మోడిఫికేషన్‌లు,13 పునరుద్ధరణలు, 4 సరోగసి జంటలకు అనుమతి మంజూరు చేశారు.

Similar News

News November 23, 2025

మెదక్: నేడు NMMS పరీక్ష

image

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్(NMMS) పరీక్ష ఆదివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందని జిల్లా విద్యాధికారులు తెలిపారు. పరీక్షకు విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ర్టానిక్‌ వస్తువులు అనుమతి లేదని, ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు.

News November 23, 2025

మహబూబాబాద్‌లో మహిళలకు అధ్యక్ష పదవులు!

image

మహబూబాబాద్ జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు జిల్లా అధ్యక్ష పదవుల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాయి. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలిగా మాలోత్ కవిత బాధ్యతలు చేపడుతుండగా, కాంగ్రెస్ అధిష్టానం సైతం డీసీసీ అధ్యక్షురాలిగా భూక్య ఉమాను నియమించింది. ఇద్దరు ఎస్టీ మహిళలను అధ్యక్షులుగా నియమించడం ద్వారా జిల్లా రాజకీయాల్లో వారి ప్రాముఖ్యత పెరిగింది.

News November 23, 2025

బాపట్ల: 108 వాహనాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

బాపట్ల జిల్లా 108 వాహనాల్లో పైలట్ పోస్ట్‌లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ పి.బాలకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పైలట్ పోస్ట్‌కు 10th పాస్, హెవీ లైసెన్స్, ట్రాన్స్పోర్ట్ , బ్యాడ్జ్ అర్హతలు కలిగి ఉండాలన్నారు. అర్హులైన వారు నవంబర్ 24వ తేది(సోమవారం) సాయంత్రం లోపు చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలోని 108 కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.