News November 22, 2025
స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు కొనసాగించండి: కలెక్టర్

కలెక్టర్ లక్ష్మిషా అధ్యక్షతన PCPNDT, DLMMAA, ART–Surrogacy అమలు పై సమీక్ష సమావేశం క్యాంపు కార్యాలయంలో జరిగింది. స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్ల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆడబిడ్డల సంరక్షణపై ప్రత్యేక పోస్టర్లు, గర్భిణీలకు యోగ–సుఖ ప్రసవంపై అవగాహన కల్పించాలన్నారు.కొత్త 12 స్కానింగ్ సెంటర్లు,19 మోడిఫికేషన్‌లు,13 పునరుద్ధరణలు, 4 సరోగసి జంటలకు అనుమతి మంజూరు చేశారు.
Similar News
News November 22, 2025
బ్లీచ్ చేయించుకుంటున్నారా?

చర్మం అందంగా మెరుస్తూ ఉండటంతో పాటు ట్యానింగ్ పోవాలని పార్లర్‌కి వెళ్లి చాలామంది స్కిన్‌కి బ్లీచ్ అప్లై చేయించుకుంటారు. బ్లీచ్‌ను చర్మానికి అప్లై చేసేముందు మాయిశ్చరైజర్ రాసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బ్లీచ్ చేయించుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే చర్మానికి బ్లీచ్ అప్లై చేయకూడదు.
News November 22, 2025
సంగారెడ్డి జిల్లాలో ఓటర్ జాబితాపై కసరత్తు

సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితాపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీల వారీగా ఓటర్ జాబితాను ప్రదర్శించారు. ఓటు లేని వారు మరోసారి నమోదు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే పరిశీలన చేస్తున్నారు. ఈ 23వ తేదీన ఓటర్ తుది జాబితాను ప్రదర్శిస్తామని అధికారులు తెలిపారు.
News November 22, 2025
హిందువులు లేకుంటే ప్రపంచమే లేదు: RSS చీఫ్

హిందువులు లేకపోతే ప్రపంచం ఉనికిలోనే ఉండదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ‘ప్రపంచంలోని ప్రతిదేశం అన్ని రకాల పరిస్థితులను చూసింది. యునాన్(గ్రీస్), మిస్ర్(ఈజిప్ట్), రోమ్, అన్ని నాగరికతలు కనుమరుగయ్యాయి. మన నాగరికతలో ఏదో ఉంది కాబట్టే మనం ఇంకా ఇక్కడున్నాం’ అని చెప్పారు. భారత్ అనేది అంతంలేని నాగరికతకు పేరు అని, హిందూ సమాజం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. మనం ఎవరిపైనా ఆధారపడకూడదని చెప్పారు.


