News December 22, 2025
స్కాలర్‌షిప్ బకాయిలు రూ.365.75 కోట్లు విడుదల

TG: బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలకు సంబంధించిన రూ.365.75 కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఎస్సీ సంక్షేమ శాఖకు ₹191.63Cr, గిరిజన సంక్షేమ శాఖకు ₹152.59Cr, బీసీ సంక్షేమ శాఖకు ₹21.62Cr విడుదలయ్యాయి. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నీ పూర్తిగా విడుదల చేసినట్లు Dy.CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా విద్య విషయంలో రాజీ పడబోమన్నారు.
Similar News
News December 23, 2025
నోబెల్ సాధిస్తే రూ.100Cr ఇస్తాం: CM CBN

భారత్‌లో క్వాంటం టెక్నాలజీ విప్లవానికి AP నాయకత్వం వహిస్తుందని CM CBN అన్నారు. క్వాంటం, దాని అనుబంధ రంగాల్లో 14లక్షల మంది నిపుణుల్ని తయారు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశామని ‘క్వాంటం టాక్ బై CM CBN’ కార్యక్రమంలో తెలిపారు. ‘క్వాంటం టెక్నాలజీతో నోబెల్ స్థాయికి మన పరిశోధనలు చేరాలి. AP నుంచి ఎవరైనా ఈ టెక్నాలజీ ద్వారా నోబెల్ సాధిస్తే రూ.100 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు.
News December 23, 2025
RECORD.. ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ ఈ సినిమాకే!

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు రూ.872 కోట్లు రాబట్టి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. స్త్రీ-2 (₹857Cr), కాంతారా: చాప్టర్-1 (₹852Cr), చావా (₹807Cr) కలెక్షన్లను బీట్ చేసింది. యానిమల్ (₹915Cr ), బజరంగీ భాయిజాన్ (₹918cr) కలెక్షన్లను దాటేసి టాప్-10 ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్స్ లిస్టులో చేరే అవకాశముంది.
News December 23, 2025
ఫ్రీగా విద్య, వైద్యం మాత్రమే ఇవ్వాలి: వెంకయ్య నాయుడు

విద్య, వైద్యం తప్ప మిగతావన్నీ ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి వేడుకలకు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ఫ్రీ బస్సులు ఇవ్వమని ఎవరు అడిగారు. ఉచితాల పేరుతో ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు. వాటిని ఆపేసి.. కష్టపడేవారికి చేయూతనివ్వాలి” అని అన్నారు.


