News March 24, 2026

స్కిప్పింగ్‌తో ఎన్నో లాభాలు

image

ప్రతిరోజు స్కిప్పింగ్​ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు. స్కిప్పింగ్​ చేయడం వల్ల కండరాలు పటిష్ఠంగా మారతాయి. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. కాళ్లు, చేతులు, ఇతర అవయవాల మధ్య సమన్వయం చక్కగా కుదురుతుంది. తద్వారా బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువ ఖర్చై బాడీ ఫిట్‌గా మారుతుంది. అంతేకాకుండా స్కిప్పింగ్​ చేయడం ద్వారా డోపమైన్​ ఎక్కువగా రిలీజ్​ అవుతుంది.

Similar News

News April 13, 2026

ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

image

CSK మాజీ కెప్టెన్ ధోనీ మరో 3-4 రోజుల్లో పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశాలున్నాయని క్రీడా వర్గాలు తెలిపాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ నెల 18న HYDలో SRHతో జరిగే మ్యాచులో ఆడతారని పేర్కొన్నాయి. కండరాల నొప్పి కారణంగా ధోనీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రేపు KKRతో మ్యాచులో ఆయన ఆడతారని టీమ్ మేనేజ్‌మెంట్ తొలుత భావించింది. కానీ పూర్తి ఫిట్‌గా మారేందుకు ఆయనకు మరికొంత టైమ్ అవసరమని సమాచారం.

News April 13, 2026

ఇంటర్ ఫస్టియర్ మార్కుల ఫార్మాట్లో మార్పులు

image

AP:ఇంటర్ ఫస్టియర్ మార్కుల ఫార్మాట్లో బోర్డు ఈఏడాది కొన్ని మార్పులు చేసింది. రిజల్ట్స్‌లో విద్యార్థుల 5గ్రూపు సబ్జెక్టుల మార్కులను మాత్రమే ప్రకటిస్తారు. ఆరోదైన అదనపు సబ్జెక్టు మార్కులు వాటితో కలపరు. కాలేజీకి పంపే మార్కుల మెమొరాండంలో వాటిని వేరుగా చూపిస్తారు. ఆ సబ్జెక్టులో ఫెయిలైనా గ్రూపు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైతే చాలు పాస్‌గా పరిగణిస్తారు. MPCలో బయాలజీ, BiPCలో మాథ్స్ అదనపు సబ్జెక్టులుగా ఉన్నాయి.

News April 13, 2026

భాగ్యశ్రీ బోర్సేకు ‘లెనిన్’ హిట్ ఇస్తాడా?

image

‘మిస్టర్ బచ్చన్’తో హీరోయిన్‌గా లాంచ్ అయిన భాగ్యశ్రీ బోర్సేకు ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా హిట్ ఇవ్వలేదు. ఆ మూవీతో పాటు తర్వాత వచ్చిన ‘కింగ్‌డమ్’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, ‘కాంత’ కూడా బాక్సాఫీసు వద్ద సక్సెస్ కాలేకపోయాయి. ప్రస్తుతం ఆమె అక్కినేని అఖిల్‌తో ‘లెనిన్’లో నటిస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం అఖిల్‌కు ఎంత ముఖ్యమో భాగ్యశ్రీకి అంతే ఇంపార్టెంట్. ఈ మూవీ ఈ ఏడాది జూన్ 26న థియేటర్లలోకి రానుంది.