News August 15, 2024

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్

image

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబోయే ఈ వర్సిటీ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించిన విషయం విదితమే. ఈ క్రమంలో గవర్నర్ సంబంధిత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు.

Similar News

News September 25, 2024

మాదిగల రెండో విడత మేలుకొలుపు యాత్ర

image

మాదిగల రెండో విడత మేలుకొలుపు యాత్రకి సంబంధించిన కరపత్రాలను డా.పిడమర్తి రవి బాచుపల్లి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఆవిష్కరించారు. ఈ నెల27, 28న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, 30, 1వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్‌లో ఈ యాత్ర జరుగనున్నట్లు తెలంగాణ మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు చిరుమర్తి రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాదిగలు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

News September 25, 2024

HYD: ఇక్కడ కేసులు సులభంగా పరిష్కరించబడును..

image

జాతీయ లోక్ అదాలత్ ని సద్వినియోగించుకోవాలని DLSA కార్యదర్శి, Sr.సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. Sept 28న RR జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ ఉంటుందన్నారు. కోర్టు ముందుకు ఇదివరకురాని, పెండింగ్, పరిష్కరించుకునే/రాజీపడే కేసులకు వేదికన్నారు. క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదా, డబ్బు రికవరీ, యాక్సిడెంట్, చిట్‌ఫండ్, ఎలక్ట్రిసిటీ, చెక్కుబౌన్స్ వంటి కేసులు సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

News September 25, 2024

BREAKING: HYD: మూసీలో అధికారుల సర్వే

image

HYD అత్తాపూర్‌ వద్ద ఆర్డీవో వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో 4 బృందాలు కలిసి <<14194082>>మూసీలో నిర్మాణాలను<<>> పరిశీలిస్తున్నాయి. నది గర్భంలోని నివాసాలు, దుకాణాల అనుమతుల వివరాలను సేకరిస్తూ యాప్ ద్వారా నిర్ధారిస్తున్నాయి. మరోవైపు గండిపేట, రాజేంద్రనగర్ వద్ద మూసీలో అధికారులు సర్వే చేస్తున్నారు. కాగా మూసీ నిర్వాసితులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అర్హులకు పునరావాసం కల్పిస్తామని అధికారి దాన కిశోర్ స్పష్టం చేశారు.