News November 11, 2024

స్కేటింగ్‌లో ఔరా అనిపిస్తున్న అనంత బుడతడు!

image

స్కేటింగ్‌లో బుడతడు సత్తా చాటుతూ అందరినీ ఔరా.. అనిపిస్తున్నాడు. అనంతపురానికి చెందిన హంజా హుస్సేన్ అనే చిన్నారి 36వ ఇంటర్‌ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో రెండు బంగారు, ఒక వెండి పతకాలను సాధించాడు. కాకినాడలో జరిగిన 7 నుంచి 9 ఏళ్ల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ చాటడంతో పాటు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు జిల్లా కార్యదర్శి రవి బాల, కోచ్ నాగేంద్ర, హేమంత్ తెలిపారు.

Similar News

News January 29, 2026

ఓ పక్క కానిస్టేబుల్ ట్రైనింగ్.. మరోపక్క గ్రూప్స్-2 ఉద్యోగం

image

తాడిపత్రిలోని నందలపాడుకు చెందిన ఇల్లూరు ప్రవీణ్ కుమార్ గ్రూప్-2 ఉద్యోగం సాధించాడు. ప్రవీణ్ కుమార్ ఎక్కడా కోచింగ్‌కు వెళ్లకుండా సొంతగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యారు. కాగా, మొన్న విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో పోస్టు సాధించి ప్రస్తుతం కడపలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్స్-2లో పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించాడు.

News January 29, 2026

భార్యాభర్తలకు గ్రూప్-2 ఉద్యోగాలు

image

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన భార్యాభర్తలు గ్రూప్-2లో ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. పట్టణానికి చెందిన వినీత సబ్ రిజిస్ట్రార్‌గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. సాఫ్ట్‌వేర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్న సమయంలో నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగాలకు రిజైన్ చేసి ప్రిపేర్ అయ్యామని Way2newsకు వారు తెలిపారు.

News January 29, 2026

శెట్టూరు: వేరుశనగకు రికార్డు ధర

image

చెళ్లకెర వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ పంటకు రికార్డు స్థాయి ధర లభించింది. శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన రైతులు నాగభూషణ గౌడ, మంజన్న, పెన్నప్ప పండించిన వేరుశనగ క్వింటా ధర రూ.12,810 పలికింది. నాణ్యమైన దిగుబడి సాధించినందుకు మార్కెట్ యార్డ్ యజమానులు రంగస్వామి, ఈరన్న రైతులను సన్మానించారు. ఈ ధర ఇతర రైతుల్లో ఆనందాన్ని నింపింది.