News December 4, 2025
స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ప్రభుత్వ పరంగా జిల్లాలో ఎటువంటి స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కానప్పటికి ఇతర జిల్లాలలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం సూచించారు. వైద్య అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజలందరూ ఆందోళన చెందవద్దని, అనుమానం ఉంటే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటే సులభంగా బయటపడవచ్చన్నారు.
Similar News
News February 11, 2026
VZM: ‘కేంద్ర ప్రభుత్వ నిధులు మార్చిలోగా వినియోగించాలి’

కేంద్ర ప్రభుత్వ నిధులను మార్చిలోగా పూర్తిగా వినియోగించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం విజయనగరం కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నిధుల వినియోగంపై సమీక్షించారు. వివిధ పథకాలను అందుబాటులో ఉన్న సుమారు రూ.40 కోట్లను మార్చి 15 లోగా ఖర్చు చేయడానికి కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు.
News February 11, 2026
VZM: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను బుధవారం ఆదేశించారు. మార్చి 16 నుంచి జరగనున్న పరీక్షల నిర్వహణకు 119 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విజయనగరం జిల్లాలోని MRO, MPDO, మున్సిపల్ కమిషనర్లతో కేంద్రాలను ముందుగానే తనిఖీ చేయించి నివేదిక ఇవ్వాలన్నారు. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని, అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
News February 11, 2026
VZM: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

ఏపీలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. విజయనగరం జిల్లాలో మొత్తం 22,959 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని DEO మాణిక్యం నాయుడు తెలిపారు. వీరి కోసం 119 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో టెన్త్ మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం కావడంతో అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. వివరాల్లో తప్పులు ఉంటే FEB-12 లోగా HMలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు.


