News December 3, 2025
స్క్రబ్ టైఫస్‌పై ఆందోళన వద్దు: DMHO

ఎన్టీఆర్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని DMHO సుహాసిని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. సుత్సుగమూషి అనే కీటకం కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని, కుట్టిన చోట ఎర్రటి మచ్చ కనిపిస్తుందని వివరించారు. పొలాలు, తోటలకు వెళ్లేటప్పుడు పొడవు చేతుల బట్టలు ధరించాలని ఆమె సూచించారు.
Similar News
News December 3, 2025
రహదారుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో నాబార్డు, ప్రణాళిక నిధులతో చేపట్టిన రహదారుల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆర్‌అండ్‌బి ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం అమలాపురం కలెక్టరేట్ నందు ఆయన అధ్యక్షతన రహదారులు భవనాల శాఖ పరిధిలో వివిధ రహదారుల మరమ్మతు పనులపై సమీక్షించారు. రహదారి అభివృద్ధి పనుల నిర్వహణపై చర్చించారు.
News December 3, 2025
మట్టి పాత్రల తయారీ ప్రోత్సహించేందుకు చర్యలు: జేసీ

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా మట్టి పాత్రల తయారీని ప్రోత్సహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో కుమ్మరి కులస్తులతో బుధవారం సమావేశం నిర్వహించారు. పర్యావరణహితమైన మట్టి పాత్రలు తయారీకై చేపట్టవలసిన చర్యలపై సమీక్ష చేశారు. మట్టి లభించే లంక ప్రాంతాలను గుర్తించి నివేదిక జిల్లా పౌరసరఫరాల అధికారికి అందించాలన్నారు.
News December 3, 2025
రాజమండ్రి కమిషనర్‌కు చంద్రబాబు అభినందన

కేంద్ర ప్రభుత్వం నుంచి ‘జల్ సంచాయ్-జన్ భాగీధారి’ అవార్డును అందుకున్న రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పర్యటనకు వచ్చిన ఆయన అవార్డును చూసి కమిషనర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కష్టపడి పనిచేస్తే ఇలాంటి అవార్డులు మరెన్నో వస్తాయని ఆయన అన్నారు. సమిష్టి కృషివల్లే ఇలాంటి అవార్డులు సాధ్యమవుతాయన్నారు.


