News December 25, 2025
స్క్రబ్ టైఫస్.. 20కి చేరిన మృతుల సంఖ్య

APలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతూ కలకలం రేపుతున్నాయి. తాజాగా బాపట్ల(D) పెదపులుగువారిపాలెంలో నాగబాబు(21) అనే యువకుడు ఈ వ్యాధితో మరణించాడు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లగా పరీక్షల్లో స్క్రబ్ టైఫస్‌గా తేలింది. పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 20కి చేరింది. కాగా ఈ పురుగు రాత్రి వేళల్లో <<18463813>>మనుషులను<<>> కుడుతుంది.
Similar News
News December 25, 2025
ఇద్దరు మంత్రులు జైలుకెళ్లడం ఖాయం: బండి సంజయ్

TG: రాష్ట్రంలోని ఇద్దరు మంత్రులు ₹వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వీరిపై కేంద్ర సంస్థలు నిఘా వేశాయని, ఎప్పటికైనా జైలుకెళ్లడం ఖాయమని మీడియాతో చిట్‌చాట్లో వ్యాఖ్యానించారు. ‘TGకి పట్టిన శని KCR కుటుంబం. అందుకే ప్రజలు ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారు. నీటివాటాలలో తప్పుచేసింది కేసీఆరే. CM రేవంత్ భాష సరికాదు. KCRను తిట్టడం వెనుక సింపతీ పెంచే కుట్ర ఉంది’ అని పేర్కొన్నారు.
News December 25, 2025
దేశభద్రతకే వాజ్‌పేయి ప్రాధాన్యం: శివరాజ్ సింగ్

AP: ప్రభుత్వమేదైనా దేశభద్రతకే వాజ్‌పేయి ప్రాధాన్యమిచ్చేవారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు. ‘ఇది నాదేశం అనే భావన ప్రజల్లో చిరస్థాయిగా నిలిచేలా వాజ్‌పేయి పనిచేశారు. పాక్‌తో యుద్ధంలో ఇందిరకు మద్దతు ఇచ్చారు. కానీ నేడు ఆమె మనవడు రాహుల్ ఆపరేషన్ సింధూర్‌ను, మోదీని విమర్శిస్తున్నారు’ అని అమరావతిలో విగ్రహావిష్కరణ సభలో పేర్కొన్నారు. AP రైతుల సంక్షేమానికి కేంద్రం తరఫున సహకరిస్తానన్నారు.
News December 25, 2025
అమ్మాయిలూ.. మీ హ్యాండ్ బ్యాగ్‌లో ఇవి ఉన్నాయా!

మహిళల హ్యాండ్‌బ్యాగ్‌లో ఎప్పుడూ ఓ చిన్న వెండి నాణెం, కొత్త నోటు ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఎరుపు వస్త్రంలో వాటిని ఉంచితే ఆర్థిక వృద్ధి కలుగుతుందని అంటున్నారు. ‘ఈ రంగు శక్తికి, సంవృద్ధికి చిహ్నం, సానుకూల శక్తిని పెంచుతుంది. అలాగే చిన్న గోమతి చక్రం, లక్ష్మీ గవ్వలను ఉంచాలి. వీటి వల్ల అప్పుల బాధలు పోయి సంపదలు చేకూరుతాయి. ఈ మార్పులతో జీవితంలో అదృష్టం, ప్రశాంతత రెట్టింపవుతాయి’ అంటున్నారు.


