News January 12, 2026
స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. కారణాలివే

నేడు స్టాక్ మార్కెట్ సూచీలు ఆరంభం నుంచే భారీ నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 600 పాయింట్లకు పైగా కుప్పకూలింది. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. 1. ట్రంప్ సర్కార్ భారత్‌పై భారీగా సుంకాలు విధిస్తుందన్న భయాలు. 2. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి నిధులను వెనక్కి తీసుకోవడం. 3.TCS వంటి బడా కంపెనీల Q3 ఫలితాలపై ఆందోళన. 4. ఇరాన్ అల్లర్లు సహా అంతర్జాతీయ ఉద్రిక్తతలు.
Similar News
News February 7, 2026
క్వాంటం వ్యాలీకి నేడే శంకుస్థాపన

AP: అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి CM చంద్రబాబు ఇవాళ 3PMకు ఉద్దండరాయునిపాలెంలో భూమి పూజ చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దేశంలోనే తొలి 133 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్‌ను అమరావతికి తీసుకొచ్చేందుకు IBM, TCS, L&T సంస్థలు కీలకంగా వ్యవహరిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
News February 7, 2026
కాలే కడుపునకు మండే గంజి

విపరీతమైన ఆకలిగా ఉన్నప్పుడు నోరు కాలేంత వేడి గంజి ఇచ్చినా అది ఎంతో రుచిగా, తృప్తిగా అనిపిస్తుంది. అదే కడుపు నిండిన వాడికి గారెలు కూడా చేదుగా అనిపిస్తాయి. ఏదైనా వస్తువు లేదా సాయం మనకు బాగా అవసరమైనప్పుడు దాని నాణ్యత కంటే ఆ సమయంలో అది అందడమే గొప్ప విషయంగా భావిస్తాము. నిజ జీవితంలో సరైన సమయానికి లభించే సాయం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ఈ సామెతను వాడుతుంటారు.
News February 7, 2026
సూర్యుడికి అర్ఘ్యం.. ఎప్పుడు సమర్పించాలంటే?

2026, FEB 8న భాను సప్తమి. ఈ రోజున సూర్యుడి అనుగ్రహం కోసం సూర్యోదయ ముహూర్తంలో అర్ఘ్యం సమర్పించడం శ్రేష్ఠం. మాఘ శుక్ల సప్తమి తిథి ఆదివారం తెల్లవారుజామున 2:54 గంటలకే ప్రారంభమవుతుంది. కావున 5:26 AM – 7:13 AM మధ్య పుణ్యస్నానాలు ఆచరించాలి. ఉదయించే సూర్యుడికి రాగి పాత్రతో నీటిని అర్ఘ్యంగా వదలాలి. ఈ పవిత్ర సమయంలో ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల జాతక దోషాలు తొలగి, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్రవచనం.


