News March 9, 2026
స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ₹7.5 లక్షల కోట్లు ఆవిరి

అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఏకంగా 753 పాయింట్ల మేర పడిపోయిన నిఫ్టీ.. మధ్యాహ్నానికి కోలుకుని 24,028(-422) వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1,353 పాయింట్లు కోల్పోయి 77,566 వద్ద స్థిరపడింది. రిలయన్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ స్వల్పంగా లాభపడ్డాయి. అల్ట్రాటెక్, మారుతి, SBI, టాటా స్టీల్ భారీగా నష్టపోయాయి. ₹7.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.
Similar News
News April 6, 2026
భూమి నుంచి 4,06,773KM.. ఆర్టెమిస్-2 సరికొత్త చరిత్ర

నాసా చేపట్టిన ‘ఆర్టెమిస్-2’ మిషన్ స్పేస్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. భూమి నుంచి 4,06,773KM దూరానికి చేరుకొని అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్రగా నిలిచింది. 1970లో అపోలో-13 మిషన్ కంటే 2,500KM+ అధిక దూరం ప్రయాణించడం విశేషం. మరికొన్ని గంటల్లో వ్యోమగాములు చంద్రుడి సమీపానికి చేరుకొని చుట్టూ పరిభ్రమించనున్నారు.
News April 6, 2026
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం కుమారుడికి జీవితఖైదు

హత్య కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు, జనతా కాంగ్రెస్ చీఫ్ అమిత్ జోగికి ఆ రాష్ట్ర హైకోర్టు జీవిత ఖైదు విధించింది. గతంలో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. 2003, జూన్ 4న NCP నాయకుడు విద్యాచరణ్ శుక్లా సన్నిహితుడైన రామావతార్ జగ్గీని పట్టపగలు కాల్చి చంపారు. ఈ కేసులో అమిత్ సహా 31 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. తర్వాత పలువురికి కోర్టులో ఊరట లభించింది.
News April 6, 2026
త్వరలో సినిమాలకు త్రిష గుడ్‌బై?

TVK చీఫ్, హీరో విజయ్‌తో రిలేషన్‌పై రూమర్స్ నడుస్తున్న వేళ నటి త్రిషపై సినీవర్గాల్లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌పై చెప్పే ఛాన్స్ ఉందంటూ రూమర్స్ వస్తున్నాయి. ప్రేమ గురించి ఆమె ఇటీవల <<19575762>>ఇన్‌స్టాలో<<>> షేర్ చేసిన పోస్ట్‌తో ఇది మొదలైంది. ఇక రీసెంట్‌గా ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పకపోవడంతో ఈ వదంతులకు బలం చేకూరింది. అయితే దీనిపై త్రిష స్పందించాల్సి ఉంది.


