News January 8, 2025

స్టీల్ ప్లాంట్‌లో కన్వేయర్లు పునరుద్ధరణ

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సింటర్ ప్లాంట్ విభాగంలో కన్వేయర్లను పునరుద్ధరించారు. సింటర్ ప్లాంట్ విభాగంలో మూడు సింటర్ మిషన్లలో రెండు మిషన్లకు ముడిసరకు సరఫరా చేసే ఏ1, ఏ2 కన్వేయర్ల గ్యాలరీ ఈనెల మూడవ తేదీన కూలిపోయిన విషయం తెలిసిందే. దీని ద్వారా నాలుగు రోజులు పాటు హాట్ మెటల్ ఉత్పత్తి తగ్గింది. మంగళవారం ఉదయం ఏ2 కన్వెయర్, సాయంత్రం ఏ1 కన్వేయర్‌ను ప్రారంభించారు.

Similar News

News January 9, 2025

ఉత్తరాంధ్రుల చిరకాల కోరిక తీరనుంది: సీఎం

image

విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో ఉత్తరాంధ్రుల చిరకాల కోరిక తీరనుందని CM చంద్రబాబు పేర్కొన్నారు. రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. మరో వైపు అనకాపల్లి జిల్లాలో రెండు భారీ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయని చెప్పారు. అరకు కాఫీని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసి ఒక బ్రాండ్ తీసుకొచ్చారన్నారు. విశాఖ ఏపీకి ఆర్థిక రాజధానిగా ఎదుగుతుందని CM చెప్పుకొచ్చారు.

News January 8, 2025

విశాఖ హిస్టరీలో మోదీయే తొలి ప్రధాని..!

image

విశాఖ మహానగరంలో ప్రధాన మంత్రి హోదాలో రోడ్ షో నిర్వహించనున్న మొదటి వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవనున్నారు. గతంలో ప్రధాని హోదాలో విశాఖ వచ్చిన ఇందిరా గాంధీ, విశ్వనాథ ప్రతాప్‌సింగ్, పీవీ నరసింహారావు బహిరంగ సభలకు మాత్రమే పరిమితమయ్యారు. కాగా మోదీ తొలిసారిగా నగరంలో రోడ్ షో నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందనున్నారు. దీంతోపాటు రూ.2లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టనున్నారు.

News January 8, 2025

36 గంటల దీక్ష.. చలిలోనే నిద్రించిన కార్మికులు

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వం రంగంలోనే కొనసాగించాలని 36 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టిన కార్మికులు మంగళవారం రాత్రి చలిలో శిబిరంలోనే పడుకున్నారు. బుధవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని దీక్షలో కూర్చున్నారు. 36 గంటల నిరాహార దీక్షను వీరు మంగళవారం ఉదయం కూర్మన్నపాలెంలో ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని కోరారు. బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.