News April 16, 2025
‘స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు మద్దతు’

స్టీల్ ప్లాంట్ కార్మికులు 16వ తేదీ నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెకు అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. సీఐటీయూ ఆఫీసులో మంగళవారం జరిగిన సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ అంశంపై ఎంపీ, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవాలన్నారు. 18న గాజువాకలో, 19న నగరంలో కాంట్రాక్టు కార్మికుల ప్రదర్శనల్లో పాల్గొంటామన్నారు. సీఐటీయూ నాయకులు కుమార్, ఎఐటియుసి మన్మధరావు పాల్గొన్నారు.
Similar News
News April 16, 2025
విశాఖ: పద్మ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

గణతంత్ర దినోత్సవ వేడుకలలో అందిస్తున్న పద్మ పురస్కారాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జూన్ గ్యాలియట్ మంగళవారం తెలిపారు. 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలకై అంతర్జాతీయ క్రీడలలో అత్యున్నత ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకువాలన్నారు. దరఖాస్తులు www.padmaawards.gov.in వెబ్ సైట్లో చూడాలన్నారు.sportsinap@gmail.com కు మే 26లోపు మెయిల్ చేయాలన్నారు.
News April 15, 2025
విజయనగరం వరకే గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్

పార్వతీపురం-సీతానగరం లైన్లో ఇంటర్ లాకింగ్ పనులు వలన పలు రైలు గమ్యాన్ని కుదించడం జరిగిందని వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ (17243/44) ఏప్రిల్ 21నుంచి మే 3వరకు గుంటూరులో బయలుదేరి విశాఖ మీదగా విజయనగరం వరకే వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు రాయగడకు బదులుగా విజయనగరం నుంచి బయలుదేరి విశాఖ మీదగా గుంటూరు వెళ్తుంది.
News April 15, 2025
చందనోత్సవంపై మంత్రుల సమీక్ష

విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బుధవారం విశాఖలో పర్యటిస్తారు. సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై దేవాదాయశాఖ, జిల్లా అధికారులతో ఉదయం 11గంటలకు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పాల్గొనున్నారు. వీటికి తగ్గట్టు జిల్లా అధికారులు, దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.