News April 1, 2025

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దీక్షకు నాలుగేళ్లు

image

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ దీక్షా శిబిరం ఏర్పాటు చేసి మంగళవారం నాటికి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ అర్ధనగ్న ప్రదర్శన, ధర్నా స్టీల్ ప్లాంట్‌ని సెయిల్‌లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

Similar News

News April 2, 2025

విశాఖ మీదుగా బయలుదేరే రైళ్లకు అదనపు బోగీలు

image

విశాఖ మీదుగా బయలుదేరే రైళ్లకు అదనపు బోగీలు వేయనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ -బరాంపూర్ ఎక్స్ ప్రెస్ (18526/25)కు ఏప్రిల్ 1నుంచి ఏప్రిల్ 30 వరకు 2 జనరల్ కోచ్, విశాఖ-రాయ్‌పూర్ (58528/27)కు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30వరకు ఒక జనరల్ కోచ్, విశాఖ- కొరాపుట్(58538/37) ఒక జనరల్ కోచ్, విశాఖ-భవానీపట్నం పాసంజర్‌కు (58504/03)ఒక జనరల్ కోచ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

News April 2, 2025

సింహాచలం అప్పన్న రథసారథికి ఆహ్వానం

image

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం ఈనెల 8న జరగనుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ సహాయక కార్యనిర్వాహణాధికారి ఆనంద్ కుమార్ రథోత్సవానికి రథసారథి అయిన కదిరి లక్ష్మణరావును తన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కదిరి లక్ష్మణరావు వంశానికి చెందిన వారే దశాబ్దాలుగా రథోత్సవం సారథిగా ఉండడం అనవాయితీ.

News April 2, 2025

విశాఖ సీపీకి హోం మంత్రి ఫోన్

image

కొమ్మాది స్వయంకృషినగర్‌లో ప్రేమోన్మాది దాడి ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దివ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దివ్యకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ప్రేమోన్మాదిని త్వరగా గాలించి పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. దివ్య తల్లి లక్ష్మి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

error: Content is protected !!