News January 4, 2025

స్టీల్ ప్లాంట్: మోసానికి పాల్పడిన తండ్రి-కొడుకులకు జైలు శిక్ష

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో తండ్రి-కొడుకులకు న్యాయమూర్తి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగి పోతయ్య ఆయన కుమారుడు వెంకటరమణ ఉద్యోగాలు ఇప్పిస్తామని 50 మంది నుంచి రూ.63 లక్షలు వసూలు చేశారు. బాధితులు 2017లో స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Similar News

News January 6, 2025

సింహాచలంలో నేటి నుంచి టికెట్ల విక్రయాలు

image

సింహాచలంలో జనవరి 10న నిర్వహించనున్న ఉత్తర ద్వారా దర్శనం టికెట్లు నేటి నుంచి ఈనెల 9 వరకు ప్రత్యేక కౌంటర్‌లో లభిస్తాయని ఈవో త్రినాధరావు తెలిపారు. కొండ కింద పిఆర్ఓ కౌంటర్‌లో రూ.500 టికెట్లు లభ్యమవుతాయన్నారు. www.aptemples.ap.gov.in వెబ్ సైట్‌లో కూడా దొరుకుతాయని వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈవో త్రినాద్ రావు తెలిపారు.

News January 6, 2025

జామ చెట్టుకు గుమ్మడికాయలు..!

image

జామ చెట్టులో గుమ్మడికాయలు కాయడం ఏంటని వింతగా చూస్తున్నారా? అవునండీ పైన కనిపిస్తున్న చిత్రం ఆదివాసీల జీవన ప్రమాణాలపై వారి ముందు చూపు, ఆలోచన విధానాన్ని తెలియజేస్తోంది. పెదబయలు మండలం గోమంగి పంచాయతీ బోయరాజులలో ఓ గిరిజన రైతు పండించిన గుమ్మడి కాయలు పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి పెరటిలో ఉన్న జామ చెట్టుకి గుమ్మడి కాయలను వేలాడ దీశాడు. దీంతో అవి చెడిపోకుండా ఉంటుందట.

News January 6, 2025

గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..! 

image

వైజాగ్ నుంచి సికింద్రాబాద్‌కు ఆదివారం బయలుదేరిన గోదావరి ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో పొగతో పాటు కాలిన వాసన రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి 1గంట సమయంలో ఖమ్మం సమీపంలోకి ట్రైన్ చేరుకునే సరికి B1 కోచ్‌లో ఫైర్ అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైలును సుమారు 45min నిలిపి సమస్య పరిష్కరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.