News November 1, 2024
స్టీల్ ప్లాంట్ రక్షణకై త్యాగాలకు సిద్ధం: వామపక్షలు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో సదస్సును అల్లూరి విజ్ఞానం కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు మాట్లాడుతూ విద్యార్థి, యువత భగత్ సింగ్ స్ఫూర్తితో ఆందోళనలతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పోరాడుదామని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కోసం విద్యార్థి యువజన సంఘాలు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని తెలిపారు.
Similar News
News November 1, 2024
విశాఖ-విజయవాడ మధ్య జన్ సాధారణ్ రైళ్లు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. విశాఖ- విజయవాడ-విశాఖ మధ్య జన్ సాధారణ్ రైళ్లను(అన్ రిజర్వుడు) శుక్రవారం నుంచి నడుపుతున్నారు. విశాఖ -విజయవాడ-విశాఖ మధ్య 1,3,4,6,8,10,11,13 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం, స్టేషన్ల మీదుగా నడుస్తాయన్నారు.
News November 1, 2024
పోయిన పెట్టుబడులు తిరిగి వస్తున్నాయి: గంటా
గత ప్రభుత్వ హయాంలో కుదేలైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు జెట్ స్పీడ్‌లో అభివృద్ధి దిశగా తీసుకు వెళుతున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఎంవీపీ కాలనీ తన నివాసంలో మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్‌కు వచ్చే నెలలో శంకుస్థాపన జరగనున్నదని వెల్లడించారు. రూ.75 వేల కోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరాన్ని రెండేళ్లలో పూర్తిచేసేలా చంద్రబాబు ప్రణాళిక రూపొందించారన్నారు.
News November 1, 2024
‘ఉత్తరాంధ్రలో 210 శివాలయాలు’
ఈ నెల 2 నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గల శివాలయాల్లో భక్తుల దర్శనానికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు దేవదాయ శాఖ ఉప కమిషనర్ సుజాత తెలిపారు. విశాఖ తన కార్యాలయంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో 210 శివాలయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కార్తీక సోమవారాల్లో శివాలయాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణ, తాగునీరు మజ్జిగ సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.