News March 25, 2025
స్టేట్ చీఫ్‌గా ఎంపీ ఈటల రాజేందర్..?

ఉగాదిలోపు తెలంగాణ BJPకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో ఊపందుకుంది. రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత రానుంది. అయితే BC నేతను నియమిస్తారా.. లేక OCకి దక్కుతుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా పరిశీలనలో ఈటల రాజేందర్ ముందువరసలో ఉన్నట్లు తెలిసింది. MP అర్వింద్, DK అరుణ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బండి సంజయ్‌కు మరోసారి అధ్యక్ష పదవీ దక్కొచ్చని చర్చ జరుగుతోంది.
Similar News
News March 28, 2025
పాడేరు: మీకోసం కార్యక్రమానికి 115 ఫిర్యాదులు

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి 115 ఫిర్యాదులు అందాయి. జేసీ అభిషేక్, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్‌తో కలిసి కలెక్టర్ దినేశ్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News March 28, 2025
45 రోజులు, 4 కేసులు.. సిద్ధార్థ్ లూథ్రాకు రూ.2.86 కోట్లు: వైసీపీ

AP: కూటమి ప్రభుత్వం ప్రజల సొమ్మును టీడీపీ లాయర్లకు దోచిపెడుతోందని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు మిత్రుడు సిద్ధార్థ్ లూథ్రాకు ఫీజు రూపంలో రూ.2.86 కోట్లను చెల్లించిందని మండిపడ్డారు. ఇది కేవలం 2024 జులై 16 నుంచి అక్టోబర్ 1 మధ్య 45 రోజుల్లో 4 కేసులకు చెల్లించిన మొత్తమని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన జీవోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
News March 28, 2025
పల్నాడు: సైన్స్ పరీక్షలకు 98.70 శాతం హాజరు

పల్నాడు జిల్లాలో శుక్రవారం జరిగిన బయోలాజికల్ సైన్స్ పరీక్షలకు 98.70 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 128 సెంటర్లలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు డీఈవో చంద్రకళ తెలిపారు. మొత్తం 25,690 మంది విద్యార్థులకు గాను పరీక్షలకు 25,347 మంది విద్యార్థులు హాజరయ్యారు. 22 మంది సిట్టింగ్ స్క్వాడ్‌లు, 13 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు పరీక్షలను పర్యవేక్షించారని డీఈవో చెప్పారు.