News April 2, 2025
స్టేట్ టాప్‌గా కామారెడ్డి ఆర్టీఏ

రెవెన్యూ వసూళ్లలో కామారెడ్డి ఆర్టీఏ రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచిందని డీటీఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేశారు. గతేడాది లక్ష్యం రూ.63 కోట్లు ఉండగా, ఈ సారి రూ.73 కోట్లకు రూ.68.19 కోట్లు (92.4%) వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో సిబ్బంది ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు.
Similar News
News December 27, 2025
NLG: యువ వికాసం కోసం ఇంకా ఎదురుచూపులే!

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న సర్కారు లక్ష్యం దరఖాస్తులకే పరిమితమైంది. ఉమ్మడి జిల్లాలో రాజీవ్ యువ వికాసం స్కీంకు వివిధ వర్గాల నుంచి 1,78,060 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క నల్గొండ జిల్లా నుంచి 79, 052 మంది యువకులు దరఖాస్తు చేసుకున్నారు. 8 నెలలు గడుస్తున్నా నిధులు మంజూరు కాకపోవడంతో యువత నిరుత్సాహానికి గురవుతోంది. దరఖాస్తుదారులకు ఇప్పటికీ ఎదురుచూపులే మిగిలాయి.
News December 27, 2025
ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇవి కూడా కారణం కావొచ్చు

ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ రావడానికి ఎన్నో అంశాలు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆలస్యంగా నిద్రపోవడం, అధిక ఒత్తిడికి గురవడం, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, అధిక/ తక్కువ బరువు, ధూమపానం వంటి అలవాట్ల వల్ల ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందంటున్నారు. అందుకే ముందుగా పీరియడ్స్, ప్రెగ్నెన్సీ గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.
News December 27, 2025
అంటే.. ఏంటి?: Backyard

ఇంటి వెనక పెరటిని Backyard అంటారు. ఇది Back, Yard పదాలను కలిపితే వచ్చింది. Back అనే ఇంగ్లిష్ పదానికి వెనక అని అర్థం. జర్మన్‌లో Gard అంటే తోట. ఆ పదాన్ని ఇంగ్లిష్‌లోని స్థలం కొలిచే ప్రమాణమైన Yardతో పోలుస్తూ BackYardగా పిలుస్తున్నారు.
రోజూ 12pmకు ఓ ఆంగ్ల పదం అర్థం, వివరణ, పుట్టుక
<<-se>>#AnteEnti<<>>


