News September 6, 2025

స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్న వడ్డాది ప్రిన్సిపల్

image

వడ్డాది ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జి.చిన్నారావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు స్వీకరించారు. శుక్రవారం సాయంత్రం అమరావతిలో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, మెమెంటో స్వీకరించారు.16 ఏళ్ల నుంచి ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పని చేశారు. ఇటీవల పదోన్నతిపై వడ్డాదికి ప్రిన్సిపల్‌గా వచ్చారు

Similar News

News September 6, 2025

హనుమకొండ: మహిళల ఆర్థిక అభివృద్ధికి గణనీయమైన కృషి: MP

image

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి గణనీయమైన కృషి చేస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. గోవా రాష్ట్రంలో నిర్వహించిన సెమినార్‌లో ఎంపీ కావ్య పాల్గొని మహిళలు డిజిటల్ ప్రపంచంలో ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళల శక్తి వృద్ధికి అవసరమైన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

News September 6, 2025

SBIలో 6,589 జాబ్స్.. పరీక్షల తేదీ ప్రకటన

image

6,589 క్లర్క్(జూనియర్ అసోసియేట్స్) పోస్టుల భర్తీకి ఈనెల 20, 21, 27 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు SBI ప్రకటించింది. త్వరలో కాల్ లెటర్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాగా AUG 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం పోస్టుల్లో 5,180 రెగ్యులర్, 1,409 బ్యాక్‌లాగ్ ఉద్యోగాలున్నాయి. వీటిలో APలో 310, TGలో 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వెబ్‌సైట్: <>sbi.co.in/web/careers<<>>

News September 6, 2025

మెదక్: 24 గంటల్లో 110 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరణ: సీఈ

image

జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 26 నుంచి 30వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను 24 గంటల్లోపే 110 గ్రామాలకు పునరుద్ధరించినట్లు చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. జిల్లా పరిధిలోని మొత్తం 115 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, అధికారులు వెంటనే స్పందించి ఎస్‌ఈ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు తమ బాధ్యతలను నిర్వర్తించారని ఆయన పేర్కొన్నారు.