News February 4, 2025
స్టేషన్ ఘనపూర్: మంటల్లో కాలిన రూ.25 లక్షల నగదు!
స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో మల్లయ్య, కృష్ణమూర్తికి చెందిన రూ.25 లక్షల నగదుతో పాటు అప్పు పత్రాలు, బియ్యం బస్తాలు, ఐలయ్యకు చెందిన రూ.5 లక్షల విలువైన టెంటు సామగ్రి మంటల్లో కాలి బూడిద అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News February 4, 2025
జగిత్యాల: 3 నెలల క్రితమే పెళ్లైంది.. ఇంతలోనే విషాదం
వెల్గటూర్ PS పరిధిలోని అంబారీపేట గ్రామానికి చెందిన అల్లే సాగర్(28) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ ఉమాసాగర్ తెలిపారు. 3 నెలల క్రితమే మృతుడికి వివాహం జరిగిందని, అతడి తండ్రి అల్లె చంద్రయ్య నెలరోజుల క్రితమే ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారని గ్రామస్థులు తెలిపారు. పెళ్లికి, గల్ఫ్ వెళ్లటానికి రూ.6లక్షలు అప్పులు చేశాడని.. వీటిని తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
News February 4, 2025
ఐటీ విచారణకు దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.
News February 4, 2025
ఎంజీయూ ఆధ్వర్యంలో ఐసెట్ నిర్వహణ
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కొరకు నిర్వహించనున్న ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐసెట్) -2025ను ఈ ఏడాది నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ కన్వీనర్ అల్వాల రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఐసెట్ నోటిఫికేషన్ ను మార్చి 6వ తేదీన విడుదల చేసి జూన్ 8, 9 తేదీల్లో ఆన్‌లైన్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.