News January 20, 2026
స్టేషన్ ఘనపూర్ మోడల్ స్కూల్‌లో పార్ట్‌టైం యోగా టీచర్ నోటిఫికేషన్

స్టేషన్ ఘనపూర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో విద్యార్థుల శారీరక-మానసిక ఆరోగ్య అభివృద్ధి కోసం యోగా బోధించేందుకు పార్ట్‌టైం యోగా టీచర్/ పార్ట్‌టైం వ్యాయామ ఉపాధ్యాయులు అవసరమని పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. యోగా లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో కలిసి 22-01-2026 లోగా పాఠశాల కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.
Similar News
News February 12, 2026
రాహుల్ సభ్యత్వం రద్దుకై BJP MP తీర్మానం

రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు BJP MP నిషికాంత్ దూబే తెలిపారు. ఈ మేరకు స్పీకర్‌కు ప్రతిపాదించారు. దీనిపై చర్చ జరిగి, ప్రభుత్వం ఓటింగ్ పెడితే సభ్యత్వం కోల్పోవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. కాగా ఒక అంశం/అభిప్రాయం/నిర్ణయంపై చర్చించాలని సభ్యులు సొంతంగా ప్రవేశపెట్టే తీర్మానాలను స్వతంత్ర తీర్మానం (Substansive Motion) అంటారు. దీనిపై చర్చపై స్పీకర్‌దే తుది నిర్ణయం.
News February 12, 2026
పోలవరం జిల్లాలో 188 మంది D గ్రేడ్ విద్యార్థులు

జిల్లాలోని 25 ZP ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 188 మంది D గ్రేడ్ విద్యార్థులు ఉన్నారని DEO మల్లేశ్వరావు తెలిపారు. పబ్లిక్ పరీక్షలు పాస్ అయ్యేలా వీరందరికి రంపచోడవరం, చింతూరులో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భోజన వసతి సదుపాయాలు కల్పిస్తూ చదివిస్తామన్నారు. వీరిలో బాలికలు 67, బాలురు 121 మంది ఉన్నారని తెలిపారు. జిల్లాలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
News February 12, 2026
కొలికపూడిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆగ్రహం?

AP: ఎంపీ కేశినేని చిన్నీపై ఆరోపణలు, ప్రభుత్వంపై పరోక్ష విమర్శలతో తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు నిత్యం <<19095636>>వివాదాల్లో<<>> ఉంటున్నారు. దీంతో అసెంబ్లీ లాబీలో కొలికపూడితో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ భేటీ అయ్యారు. క్రమశిక్షణ దాటితే ఉరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. అనుభవరాహిత్యంతో పొరపాట్లు జరుగుతున్నాయని, సీనియర్లు మార్గనిర్దేశం చేయాలని కొలికపూడి కోరినట్లు తెలుస్తోంది.


