News February 24, 2025

స్టేషన్ ఘనపూర్: యువత సరైన మార్గంలో ప్రయాణించాలి: ఎంపీ కావ్య

image

యువత సరైన మార్గంలో ప్రయాణించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఇప్పగూడెం గ్రామానికి చెందిన యువత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సందర్భంగా ఎంపీని కలిశారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, యువత తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

Similar News

News February 24, 2025

యాదాద్రి: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో నల్గొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

News February 24, 2025

నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల

image

ప్రధాని మోదీ నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన 19వ విడత కింద దేశంలోని రైతులకు రూ.22వేల కోట్ల నిధులను విడుదల చేస్తారు. రైతులకు ఏడాదిలో ఒక్కో విడతలో రూ.2వేలు చొప్పున 3 విడతల్లో కేంద్రం రూ.6వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 18 విడతల్లో రూ.3.46లక్షల కోట్లు చెల్లించారు.

News February 24, 2025

వికారాబాద్: ఆరు పాఠశాలల్లో ఏఐ విద్య: DEO

image

VKB జిల్లాలోని ఆరు పాఠశాలల్లో AI విద్యను అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టుగా 36 పాఠశాలల్లో అమలు చేస్తుండగా 6 పాఠశాలలు జిల్లాలో ఉన్నాయి. దోమ మండలంలోని బొంపల్లి, పరిగి మండలంలోని గడిసింగాపూర్, తాండూరులోని సాయిపూర్, కొడంగల్, కోట్పల్లి, VKB మండలంలోని పులుమద్ది పాఠశాలల్లో ఏఈ విద్యను అమలు చేయనున్నారు. ప్రతి ఒక్కరి కృషితో AI విద్యను అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు DEO తెలిపారు.

error: Content is protected !!