News March 11, 2026

స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక తప్పదా..?

image

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పేలా లేదు. ఇప్పటికే స్పీకర్ ఇరువురి వాదనలు విని, తన తీర్పును ఈరోజుకు వాయిదా వేశారు. గత పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ప్రచారం తాలూకు వీడియోలను స్పీకర్‌కు ప్రతివాదులు అందజేశారు. కడియం శ్రీహరిపై నమోదైన అనర్హత పిటిషన్‌ను ఇప్పటికే విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. తన తీర్పును ఈరోజు ఉదయం 10 గంటలకు వెలువరించనున్నారు.

Similar News

News April 5, 2026

ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

image

సంకటహర చతుర్థిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. భక్తులు భారీగా తరలిరావడంతో రద్దీని క్రమబద్ధీకరించేందుకు అధికారులు రూ. 500 టికెట్లు, అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించారు. ఈవో శీనానాయక్ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News April 5, 2026

హార్ముజ్‌ను తెరవండి.. లేదంటే నరకానికి పంపిస్తా: ట్రంప్

image

హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్‌కు US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. లేదంటే వచ్చే మంగళవారం పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ‘జలసంధిని తెరవండి పిచ్చి బా*ర్డ్స్. లేదంటే నరకానికి పంపిస్తా. అల్లాను ప్రార్థించండి’ అంటూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. 48 గంటల్లో హార్ముజ్‌ను ఓపెన్ చేయకపోతే <<19568118>>ప్రళయం<<>> సృష్టిస్తామని నిన్న ట్రంప్ హెచ్చరించడం తెలిసిందే.

News April 5, 2026

మందస: తండ్రిని కొట్టి చంపిన కుమారుడు

image

మందస(మ) లొహరిబందలో ఆదివారం జరిగిన హత్య కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం..లొహరిబందిలో నివసిస్తున్న లక్ష్మీనారాయణను కుమారుడు ఏకాంబరం ఇంటిలో ఎవరూ లేని సమయంలో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. రక్తపుమడుగుల్లో ఉన్న లక్ష్మీనారాయణను చూసి కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మానసిక స్థితి సక్రమంగా లేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు అంటున్నారు. ఎస్సై కృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేశారు.