News January 24, 2025
స్టే.ఘనపూర్: ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ఫోన్.. చివరికి!

ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకున్న చోట కాకుండా.. మరో గ్రామంలో ఇల్లు వచ్చిందంటూ అధికారులు ఫోన్ చేయడం లబ్ధిదారుడిని అయోమయంలో పడేసింది. స్టే.ఘనపూర్‌కు చెందిన దేవరాయి కుమారస్వామి తన భార్య పేరుతో ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకున్నాడు. కాగా గురువారం స్టే.ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో తనకు ఇల్లు మంజూరైనట్టు అధికారులు ఫోన్ చేశారు. ఇది ఎలా అని అడిగితే మిస్టేకంటూ పేరు కొట్టివేశారని బాధితుడు చెప్పారు.
Similar News
News March 14, 2025
ఒక్కరోజే రూ.1,200 పెరిగిన గోల్డ్ రేట్

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 పెరిగి రూ.82,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరగడంతో రూ.89,780కు చేరింది. అటు వెండి ధర రూ.2,000 పెరగడంతో ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,12,000గా ఉంది.
News March 14, 2025
VIRAL: కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ చూశారా?

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరో 8 రోజుల్లో ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుండగా, ఆయన నయా హెయిర్ స్టైల్ చేయించుకున్నారు. ఈ ఫొటోలను హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ ఖాన్ షేర్ చేస్తూ ‘GOAT ఎనర్జీ’ అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో 218 రన్స్ చేసిన కింగ్, ఈసారి తన బ్యాటింగ్‌తో ఆర్సీబీకి తొలి కప్ అందిస్తారేమో చూడాలి.
News March 14, 2025
ఇబ్రహీంపట్నంలో విద్యుత్ ఉద్యోగి మృతి

ఇబ్రహీంపట్నంలో విద్యుత్ ఉద్యోగి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మణికుమార్ అనే వ్యక్తి విద్యుత్ ఉద్యోగిగా గుర్తించామన్నారు. కుటుంబ కలహాలతో వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ కాలువలో దూకి మృతిచెందాడని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.